బిగ్ బాస్ స్కెచ్ బయటపెట్టిన శ్రీహాన్.. షో కోసమే వాళ్ళ లవ్ అంటూ కామెంట్!

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం తెలుగులో ఈ కార్యక్రమం ఆరవ సీజన్ ప్రసారం అవుతుంది.

ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రతి సీజన్లోనూ కొన్ని జంటల మధ్య లవ్ ట్రాక్ లు నడపడం జరుగుతూ వస్తుంది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు కనిపించిన కంటెస్టెంట్ లో బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారు.

అయితే ఇదంతా కేవలం షోపై ఆసక్తి పెరగడం కోసమే నిర్వాహకులు ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రతి సీజన్ లాగే ఆరవ సీజన్లో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య ఇలాంటి లవ్ ట్రాక్స్ క్రియేట్ చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ శ్రీ సత్యతో అర్జున్ పులిహోర కలపడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఆమె వెంటే తిరుగుతూ కనిపిస్తున్నారు.

ఇక శ్రీ సత్యను పడేయడానికి అర్జున్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే ఆమె మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంది.

ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో భాగంగా నేహా చౌదరి శ్రీ సత్య అర్జున మద్య అసలు ఏముంది అంటూ ప్రశ్నించింది.

"""/"/ ఇలా నేహా చౌదరి అడిగిన ప్రశ్నకు వెంటనే శ్రీహన్ వారిద్దరి మధ్య ఏదో ఉంది.

కానీ చెప్పడం లేదు ఆ పిల్ల మాత్రం తనని బ్రదర్ అని పిలవనా అంటుంది అంటూ వీరిద్దరి గురించి తెలిపారు.

ఇలా శ్రీహాన్ మాటలకు నేహా స్పందిస్తూ అర్జున్ వాసంతితో కూడా ఇలాగే ఉంటున్నారు కదా ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ నా అంటూ ఆమె సందేహం వ్యక్తం చేస్తుంది.

నేహా చౌదరి ఇలా సందేహం వ్యక్తం చేసేసరికి శ్రీహన్ వీరిద్దరూ ఒక్కోసారి షో కోసం ఇలా చేస్తుంటారు అంటూ బిగ్ బాస్ స్కెచ్ మొత్తం బయట పెట్టారు.

ఇలా శ్రీహన్ టంగ్ స్లిప్ కావడంతో బిగ్ బాస్ కేవలం షో కోసం మాత్రమే ఇలాంటి లవ్ ట్రాక్స్ క్రియేట్ చేస్తారని తెలిసిపోయింది.

మొత్తానికి శ్రీహన్ ఇలా అసలు విషయం బయట పెట్టారు.

భారతీయులకు శుభవార్త .. ఇకపై అమెరికాలోనే హెచ్ 1 బీ వీసా రెన్యూవల్