యంగ్ హీరోలలో శ్రీవిష్ణును ఎంత మెచ్చుకున్నా తక్కువేనా.. ఎందుకంటే?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా మంచి మంచి కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

అలాంటి వారిలో యంగ్ హీరో శ్రీ విష్ణు ( Sri Vishnu )కూడా ఒకరు.

ఏడాదిగా కనీసం రెండు మూడు సినిమాలను విడుదల చేస్తూ వరుసగా ఒక దాని తర్వాత ఒకటే సక్సెస్ లో అందుకుంటూ దూసుకుపోతున్నారు శ్రీ విష్ణు.

కథల ఎంపిక విషయంలో కూడా శభాష్ అనిపించుకుంటున్నారు.ఇకపోతే శ్రీ విష్ణు తాజాగా నటించిన చిత్రం శ్వాగ్( Swag ).

తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి బాగానే రెస్పాన్స్ వస్తోంది .

"""/" / సాధారణ ప్రేక్షకులకు ఏ మేరకు రీచ్ అవుతుందనేది ఇంకో రెండు మూడు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.

క్లిష్టంగా అనిపించే కాన్సెప్ట్ ని ఎమోషనల్ గా చెబుతూనే ట్రెండ్ మిస్ అవ్వకుండా చెప్పాలని చూసిన దర్శకుడు హసిత్ గోలి హిట్ అందుకుంటాడా లేదా అనేది పక్కనే పెడితే ఫిలిం మేకింగ్ పరంగా ఒక కొత్త ఒరవడిని ట్రై చేసిన మాట వాస్తవం.

స్క్రీన్ ప్లేలో కాస్త కన్ఫ్యూజన్ తగ్గించి, నాగార్జున ( Nagarjuna )మనం తరహాలో అందరికీ అర్థమయ్యేలా కథనం రాసుకుని ఉంటే మెరుగైన ఫలితం దక్కేదనే కామెంట్లో నిజముంది.

కాగా శ్రీ విష్ణు మాత్రం స్వాగ్ దెబ్బతో ఒకేసారి నాలుగు మెట్లు ఎక్కేశాడు.

ఎలా అంటే నాలుగు విభిన్న పాత్రలు చేయడమే కాక వాటిలోని వేరియేషన్స్ ని మెప్పించేలా నటించడంతో పాటు పదకొండు గెటప్స్ లో శభాష్ అనిపించుకున్నాడు.

"""/" / మాములుగా అయితే ఇలాంటి సబ్జెక్టుకి యూత్ హీరోలు అంత సులభంగా ఓకే చెప్పరు.

రిస్క్ తో ముడిపడిన వ్యవహారం కాబట్టి ఇమేజ్ కి ఇబ్బందవుతుందనే ఉద్దేశంతో నో అనేస్తారు.

ఓం భీమ్ బుష్ లోనూ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ వెనుక షాకింగ్ ట్విస్టుకి ఒప్పుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు స్వాగ్ లోనూ క్రియేటివ్ కంటెంట్ ఎంచుకున్నాడు.

ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కుర్ర హీరోలే సేఫ్ గేమ్ ఆడుతున్న పరిస్థితిలో శ్రీవిష్ణు లాంటి వాళ్ళు ప్రయోగాలు చేయడం అవసరమే.

కమర్షియల్ గా రికార్డులు బద్దలు కొట్టకపోవచ్చు కానీ ఎప్పటికైనా గుర్తుండిపోయే ఎక్స్ పరిమెంట్స్ ఇవి.

దాంతో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ విష్ణు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

శ్రీవిష్ణు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తేనెతో నిద్రలేమి ఇక దూరం..!