ఆ ఫ్లాప్ మూవీ నుంచి తప్పించుకున్న శ్రీలీల.. ఈ హీరోయిన్ కు లక్ ఉందంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల( Sreeleela ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంది.

అందం అభినయంతో పాటు డాన్సింగ్ టాలెంట్ ఉన్నది శ్రీలీల కీ భారీగానే అభిమానులు ఉన్నారు.

ఏ హీరో సినిమా చూసినా అందులో హీరోయిన్ శ్రీ‌లీలే. """/" / కానీ వ‌రుస ఫ్లాపుల‌తో శ్రీ‌లీల కెరీర్ కు స‌డ‌న్ బ్రేకులు ప‌డ్డాయి.

పైగా శ్రీ‌లీల క్యారెక్ట‌ర్ల‌న్నీ ఒకే మూస‌లో కొట్టుకుపోవ‌డం వ‌ల్ల త‌న కెరీర్ ని మ‌రింత ఇబ్బందికి గురి చేసింది.

అందుకే కాస్త బ్రేక్ తీసుకొంది.ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలో ఆలోచించుకోవ‌డానికి, త‌ప్పుల్ని స‌రిదిద్దుకోవ‌డానికీ ఈ బ్రేక్ ఆమెకు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఈ మ‌ధ్య కొన్ని ఆఫ‌ర్లు కూడా తిరస్కరించిందట.అందులో విజయ్( Vijay ) సినిమా కూడా ఉంది.

గోట్లో( The GOAT Movie ) త్రిష( Trisha ) ఒక ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించిన సంగ‌తి తెలిసిందే.

నిజానికి ఈ ఆఫ‌ర్ ముందుగా శ్రీలీల ద‌గ్గ‌ర‌కు వచ్చిందట. """/" / త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ ప‌క్క‌న చిందులు వేయాల‌ని ప్ర‌తీ హీరోయిన్ కోరుకుంటుంది.

ఆ అవ‌కాశం కెరీర్ ఆరంభంలోనే వ‌స్తే.అంత‌కంటే కావల్సింది ఏముంది? కానీ శ్రీ‌లీల మాత్రం వేరేలా ఆలోచించింది.

అప్ప‌టికే వ‌రుస ప‌రాజ‌యాల‌తో అల్లాడుతున్న శ్రీ‌లీల‌ ఐటెమ్ గర్ల్ అన‌గానే ఆలోచ‌న‌లో ప‌డింది.

ఫ్లాపుల్లో ఉన్న‌ప్పుడు ఐటెమ్ గాళ్ గా క‌నిపిస్తే, త‌న‌పై ఆ ముద్రే ప‌డిపోతుంద‌ని, ఫ్లాపులు ఉన్నాయి కాబ‌ట్టి ఐటెమ్ గాళ్ గా సెటిల్ అయిపోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని శ్రీ‌లీల గ్ర‌హించింది.

అందుకే పారితోషికం ఎంత ఇస్తామ‌న్నా శ్రీ‌లీల ఒప్పుకోలేదట.చివ‌రికి ఆ ఆఫర్ కాస్త హీరోయిన్ త్రిష ద‌గ్గ‌ర‌కు వెళ్లింది.

గోట్లో త్రిష క‌నిపించ‌డం విజ‌య్ అభిమానుల‌కు షాకే.కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఆ ఐటెమ్ పాట కూడా అంత‌గా క్లిక్ అవ్వ‌లేదు.దాంతో శ్రీ లీలా ఈ సినిమా అవకాశాన్ని వదులుకొని మంచి పని చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేశారా.. నిన్న నాగార్జున నేడు బన్నీ.. ఎక్కడ చెడింది?