రామ్ పోతినేని వివాహం… క్లారిటీ ఇచ్చేసిన స్రవంతి రవి కిషోర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి.ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోలుగా ఎంతో మంచి సక్సెస్ సాధించిన వారందరూ కూడా పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ఉన్నటువంటి శర్వానంద్ (Sharwanand)కూడా తాజాగా వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇదే బాటలో మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) కూడా పయనిస్తున్నారు.

ఈయన కూడా నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) తో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.

త్వరలోనే ఈయన కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.అయితే ఈ హీరోల బాటలోనే మరొక హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

"""/" / టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ పోతినేని (Ram Pothineni) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ఈయన పెళ్లి (Marriage) చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా రామ్ పెళ్లి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలను హీరో రామ్ లేదా అతని టీం ఖండించకపోవడంతో ఇది నిజమేనని అందరూ భావించారు.

అయితే తాజాగా రామ్ పెళ్లి వార్తల గురించి స్రవంతి రవి కిషోర్(Sravanthi Ravi Kishore) స్పందించి క్లారిటీ ఇచ్చారు.

"""/" / తెలుగు చిత్ర పరిశ్రమలో స్రవంతి రవి కిషోర్ మూవీస్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే స్రవంతి రవి కిషోర్ స్వయానా హీరో రామ్ కి బాబాయ్ అవుతారు.

దీంతో రామ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈయన రామ్ పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ రామ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈయన కొట్టి పారేశారు.

ఒకవేళ రామ్ కి వివాహం కనుక నిశ్చయమైతే ఆ విషయం దాచాల్సిన అవసరం లేదని అందరితో ఈ విషయం పంచుకుంటాము అంటూ ఈ సందర్భంగా స్రవంతి రవి కిషోర్ రామ్ పెళ్లి గురించి క్లారిటీ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బెల్లానికి వీటిని కలిపి తీసుకుంటే ఆరోగ్య లాభాలే లాభాలు..!