మాకు సినిమా వ్యాపారం కాదు.. ఓటీటీపై కామెంట్ చేసిన స్రవంతి రవికిషోర్!
TeluguStop.com
గత ఏడాది నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సంగతి మనకు తెలిసిందే.
అంతే కాకుండా సినీ పరిశ్రమలో కూడా ఎన్నో సినిమాలు వాయిదా పడగా ఇటీవలే లాక్ డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ లను ప్రారంభించాయి.
కాగా మొన్నటి వరకు సినిమా హాల్స్ ఓపెన్ కాకపోగా ఎన్నో సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేశారు.
కాగా ఈ విషయం గురించి స్రవంతి రవికిషోర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవలే హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయగా మంచి విజయాన్ని సాధించింది.
కాగా కొన్ని సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల చేయగా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి.
దీనివల్ల చాలామంది సినీ నిర్మాతలకు ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి ఆసక్తి చూపలేదు.
అంతేకాకుండా కొందరు చిత్ర నిర్మాతలు తప్పనిసరి లో విడుదల చేశారు.ఇదిలా ఉంటే స్రవంతి రవికిషోర్ కూడా ఓటీటీ విడుదలకు వ్యతిరేకంగానే ఉన్నారు.
"""/"/
ఇటీవలే తిరుమల కిషోర్ దర్శకత్వం లో వచ్చిన సినిమా రెడ్.ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించగా మంచి విజయాన్ని సాధించింది.
కాగా ఈ చిత్రానికి స్రవంతి రవి కిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత గా చేశాడు.
ఈ సినిమా విడుదల తర్వాత రవికిషోర్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
రెడ్ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలని చాలామంది ఆఫర్ చేయగా.సినిమా హాల్లోనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ తెలిపాడట.
ఈ సినిమాను థియేటర్ లోనే విడుదల చేయాలని ఇన్నిరోజులు ఆగమని తెలిపారు.దీంతో 10 రూపాయలు పెట్టుబడి పెడితే పన్నెండు రూపాయలు వస్తే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారని తెలుపగా.
పది రూపాయలకు 9 రూపాయలు వచ్చిన,12 రూపాయలు వచ్చిన అది ప్రేక్షకుడి నుంచే రావాలని కోరుకున్నాడట.
సినిమా విజయాన్ని ఈ విధంగా దక్కించుకోవడానికి కొద్ది మంది నిర్మాతలు మాత్రమే ఉంటారని తెలిపారు.
కానీ మరికొంత మంది నిర్మాతలు సినిమాను వ్యాపారంగా చేస్తూ పెట్టుబడి కంటే ఎక్కువ లాభం వస్తే చాలు అనుకునే వాళ్ళు ఉండగా వాళ్లను ప్రశ్నించలేమంటూ వ్యాఖ్యలు చేశాడు రవి కిషోర్.
అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం వెనక ఎవరు ఉన్నారు…