రోడ్డుపైన ఇద్దరు వృద్దులను చూసి ఎన్టీఆర్ చేసిన ఆ పని చరిత్ర సృష్టించింది

గొప్ప గొప్ప ఆలోచనలు గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు మాత్రమే చేయగలరు.అలాంటి ఆలోచనలు ఎంతో మందికి మంచి జీవితాన్ని మార్చుతాయి.

సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్న క్రమం లో అయన 60 వ పుట్టిన రోజుకు రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఇక అనుకున్నదే తడవుగా అటు వైపు అడుగులు వేసి తెలుగు దేశం పార్టీ ని స్థాపించారు.

తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నినాదం తో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతా కూడా కలియతిరిగారు.

అయన నినాదం జనాలకు మంత్రంలా పని చేసింది.అందుకే పార్టీ మొదలు పెట్టిన 9 నెలలకే అధికారం లో కి వచ్చి సంచలనం సృష్టించారు.

ఇక సీఎం కుర్చీ అధీష్టించిన తర్వాత అయన ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టారు.

రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి బడుగు, బలహీన వర్గాలకు కడుపు నిండా అన్నం తినే అదృష్టం కలిగించాడు.

మధ్య నిషేధం ప్రకటించి ఎంతో మంది అబలలకు ఆరాధ్య దైవంగా మారాడు.అయన చేసిన మంచి పనులు చెప్పుకుంటూ పోతే అంతు అనేది ఉండదు.

ఇక లక్ష్మి పార్వతి ఎంట్రీ ఇవ్వడం తో అయన గౌరవం పై నీలినీడలు కమ్ముకున్నాయి.

అధికారం కోసం అర్రులు చాచిన వారికి అదొక సాకులాగా కనిపించి ఉన్నవి లేనివి కల్పించి అయన పైన నమ్మకం పోయేలా చేసి చివరికి అన్నగారి నుంచి పార్టీ ని పదవిని లాక్కొని కన్ను మూసే వరకు కొన్ని దుష్ట శక్తులు పని చేసాయి.

వైస్రాయ్ హోటల్ ముందు జరిగిన ఘటన అన్నగారిని తీవ్రంగా కాల్చివేసి చివరికి గుండెపోటుకు కారణం అయ్యింది.

"""/"/ ఇక అస్సలు విషయంలోకి వస్తే ఒక రోజు అనంతపురం పర్యటనకు వెళ్లిన అన్నగారికి రోడ్ పక్కన ఇద్దరు వృద్ధ దంపతులు పని చేసుకుంటూ కనిపించారు.

వారిని చూసి కారు ఆపి దగ్గరికి వెళ్ళాడు ఎన్టీఆర్.ఎందుకు మీరు ఇక్కడ పని చేస్తున్నారు ఈ వయసులో అని అడిగారట.

దాంతో ఆ వృద్ధ దంపతులు తమ పరిస్థితిని వివరించారట.అయ్యా మాకు ఎకరంనర భూమి ఉంది ఇద్దరు కొడుకులు ఉన్నారు.

వారికి చెరొక అర్ద ఎకరం పంచి ఇచ్చి తామొక అర్ద ఎకరం దున్నుకుంటున్నాం.

నా కొడుకులు ఆ అర్ద ఎకరం లో పంట పండించి కుటుంబాన్ని పిల్లలను సాకాలి.

మమ్మల్ని వారు చూసుకునే స్థితిలో లేరు అందుకే ఈ భూమిని దున్నుకుంటున్నాం అని చెప్పారట.

ఆ రోజు అన్నగారికి వారిని చూడగానే మనసు చలించి పోయింది.దాంతో వృధ్యాప్య పెన్షన్ స్కీమ్ ని ప్రవేశ పెట్టి వృద్దులకు చేయూత ఇచ్చారు.

వైరముత్తు చాలా మంచోడు.. చిన్మయి క్యారెక్టర్ అలాంటిది: కస్తూరి శంకర్