Sr NTR Raja Sulochana: వేశ్య‌గా ముద్ర‌ప‌డిన నటిని గొప్ప హీరోయిన్‌గా మార్చిన సీనియర్ ఎన్టీఆర్‌… ఎవరంటే…

ఈ తరం టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ రాజసులోచన( Raja Sulochana ) అప్పట్లో చాలా పాపులర్ నటిగా, డ్యాన్సర్ గా వెలుగొందేది.

ఈ ముద్దుగుమ్మ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో పనిచేసింది.ఈమె అసలు పేరు రాజలోచన, ( Rajalochana ) తల్లిదండ్రులకు ఆమె ఏకైక సంతానం.

అందుకే చిన్నతనం నుంచి ఎంతో గారాబంగా పెంచేవారు.ఆమె పట్ల తమకున్న గౌరవాన్ని, అభిమానాన్ని తెలియజేసేందుకు ఆమె పేరు ముందు రాజా అనే పదాన్ని కూడా చేర్చారు.

అయితే, ఆమె పాఠశాలలో చేరినప్పుడు, ఆమె పేరు తప్పుగా రాజసులోచన అని రాయడం జరిగింది, అదే చివరికి ఆమె అఫీషియల్ పేరుగా మారింది.

రాజసులోచన చిన్నతనం నుంచే డ్యాన్స్‌ని ఇష్టపడింది, ఆ అభిరుచిగా పెద్దయ్యాక కూడా కొనసాగించింది.

సినిమాల్లో నర్తకి గా కనిపించాలని ఆశపడింది.ఆమె కలలను నెరవేర్చడంలో తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలిచారు.

అయితే ఈ నటి తన తండ్రికి ఇష్టం లేని వేశ్య పాత్రతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

తన తల్లి ప్రోత్సాహంతోనే వేశ్య అయినా పెద్దగా భయపడకుండా ఆమె అందులో నటించింది.

"""/" / దురదృష్టవశాత్తు, ఆ పాత్ర ఆమెకు కళంకంలా మారింది.ఆమె చాలా సినిమాల్లో వేశ్యగా టైప్‌కాస్ట్ చేయబడింది.

ప్రతి డైరెక్టర్ ఆమెను అలాంటి పాత్ర చేయాలని అడగడంతో ఇక కెరీర్ తనపై వేశ్య అనే ముద్ర వేసిందని ఆమె ఎంతో బాధపడింది.

తనకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చే ఒక్క దర్శకుడు కూడా దొరకడా అని ఎంతో ఆశించింది.

చివరికి తనకు వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం కష్టమే అని నిరాశ పడిపోయింది.

ప్రజలు ఆమెను బయట కూడా వేశ్యగా చూసేవారు.ఆ ఇమేజ్ కారణంగా ఆమె తన వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలను ఎదుర్కొంది.

"""/" / సరిగ్గా అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Ramarao ) తన టైగర్ రాముడు( Tiger Ramudu Movie ) సినిమాలో ఆఫర్ ఇచ్చాడు.

దాంతో ఆమె ఫేట్ మారిపోయింది.ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది, రాజ సులోచన కథానాయికగా స్థిరపడింది.

ఆమె ఎన్టీఆర్‌తో మరో నాలుగు సినిమాల్లో నటించింది, అవన్నీ విజయవంతమయ్యాయి.ఆమె తన కెరీర్‌లో తరువాత వివిధ క్యారెక్టర్స్‌ కూడా పోషించింది.

అలా రాజ సులోచనను వేశ్య పాత్రల నుంచి ఎంతో మంది అభిమానించే హీరోయిన్ గా మార్చడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు.

ఆ టైం లో అక్కినేని కూడా ఆమెను బాగానే ఎంకరేజ్ చేశారు.

అవిసె గింజలతో ఇలా చేశారంటే వద్దన్నా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.. తెలుసా?