ఒకవైపు ముఖ్యమంత్రి పదవి..మరోవైపు సినిమాలు..ఎన్టీఆర్ ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా..?

ఎన్టీఆర్‌.తెలుగు సినీ ప్ర‌పంచంలో ఆయ‌న పేరు చిర‌స్థాయిగా మిగిలి ఉంటుంది.

సాంఘిక‌, పౌరాణిక‌, జాన‌ప‌ద చిత్రాల్లో ఆయ‌న న‌టించారు.ఎన్టీఆర్‌కు పౌరాణిక చిత్రాలు అంటే ఎంతో ఇష్టం.

ఆయ‌న సీఎం అయ్యాక కూడా సినిమాల్లో న‌టించారు.అలా సీఎం అయ్యాక చేసిన మూవీ బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌.

1988లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.1989లో విడుద‌ల చేయాల‌ని భావించారు.

కానీ అనుకోని ప‌రిస్థితుల కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల‌ ఎన్నోసార్లు. """/"/ 1989లో ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.

ఆ స‌మ‌యంలోనే ఈ మూవీ మొద‌లు పెట్టారు.అయితే రాష్ట్రంలో ప‌రిస్థితులు అనుకూలంగా లేవు.

న‌క్స‌లైట్ల దాడులు పెచ్చు మీరాయి.వ‌ర‌ద‌లు వ‌చ్చి క‌రువు ఏర్ప‌డింది.

ఈ స‌మ‌యంలో సినిమా మొద‌లు పెట్ట‌డం ప‌ట్ల విప‌క్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నేత‌ల నుంచీ విర్శ‌లు వ‌చ్చాయి.

ప్ర‌భుత్వ ఉద్యోగులు సైతం ఎన్టీఆర్ సినిమా ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త క‌న‌బ‌ర్చారు.ఆ సంవ‌త్స‌రం అంతా స‌మ‌స్య‌ల‌తో గ‌డిచిపోయింది.

"""/"/ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే సినిమాలోనూ న‌టించారు.సినిమా షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు అధికారులు ఫైల్స్ తీస‌కొచ్చేవారు.

అక్క‌డే ముఖ్య‌మైన ద‌స్త్రాల‌పై సంత‌కాలు చేసేవారు.అది చూసి ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా విమ‌ర్శించేవారు.

విశ్వామిత్ర వెంట‌ మేన‌క వ‌స్తే త‌ప్ప ఆసెంబ్లీకి, స‌చివాల‌యానికి రారు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేవారు.

అయినా ప్ర‌తిప‌క్షాల మాట‌ల‌ను ఎన్టీఆర్ ప‌ట్టించుకోలేదు.సినిమాను ఎలాగైనా పూర్తి చేయాల‌నుకున్నారు.

ఈ సినిమా కోసం ఎంతో బ‌రువు త‌గ్గారు ఎన్టీఆర్.ఫుడ్ విష‌యంలో క‌ఠినంగా ఉండే వారు.

భోజ‌నం పూర్తిగా మానేశారు.కేవ‌లం పండ్లు తింటూ.

నేల‌మీదే ప‌డుకునే వారు.అష్ట‌క‌ష్టాలు ప‌డి సినిమా షూటింగ్ పూర్తి చేశారు.

ఇక సినిమా విడుద‌ల చేద్దాం అనే స‌మ‌యంలోనే ఎన్నిక‌లు వ‌చ్చాయి.దీంతో రిలీజ్ వాయిదా ప‌డింది.

ఎన్నో ఇబ్బందులకు గురైన ఈ సినిమా 1991 ఏప్రిల్ 19న విడుద‌ల అయ్యింది.

ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ పొందింది./p.

మళ్ళీ ఆ స్టార్ హీరో తోనే సినిమా చేస్తున్న కృష్ణ చైతన్య…