Senior NTR : తల్లి తో పాటు కూతురికి కూడా హీరో గా నటించిన ఏకైక హీరో ఎవరో తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ).ఈ యుగానికి ఆయన ఒక్కడు మాత్రమే టాలీవుడ్( Tollywood ) లో తిరుగులేని రికార్డులను సృష్టించాడు.

సినిమా చరిత్రను తిరగ రాశాడు.ఆయనతో నటించిన హీరోయిన్స్ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేది.

ఎన్టీఆర్ తో నటించాలని అప్పటి హీరోయిన్స్ అంతా కూడా తహతహ లాడేవారు.అంతే కాదు ప్రతి విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉండే ఎన్టీఆర్ తో నటిస్తే వారికి నటన విషయంలోనూ అలాగే క్రమశిక్షణ విషయంలోనూ కొన్ని పద్ధతులు అలవాటు అవుతాయని హీరోయిన్స్ అంతా కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూసేవారు.

ఇక నటి జయ లలిత( Actress Jaya Lalitha ) విషయంలో ఎవరికీ తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది.

"""/" / ఆమె హీరోయిన్ గా తమిళనాడు ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో సీనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశం లభించింది.

అందువచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకున్నారు.ఎన్టీఆర్, జయలలిత కలిసి నటించడం మొదటి చిత్రం గోపాలుడు భూపాలుడు( Gopaludu Bhupaludu ).

ఈ సినిమా తర్వాత మంచి అందమైన జంటగా వీరికి పేరు దక్కింది.ఇక ఎన్టీఆర్ తో శ్రీ కృష్ణ సత్య అనే సినిమాలో కూడా జయ లలిత సత్యభామ గా నటించారు ఈ సిత్రాన్ని ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ నిర్మించడం విశేషం.

ఇక ఈ ఇద్దరు విషయంలో ఒక ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే, ఈ ఇద్దరు సినిమా రంగంలోకి వచ్చి ఆ తర్వాత రాజకీయాల్లో కూడా ప్రవేశించి ఈ ఇద్దరు ముఖ్య మంత్రులుగా ఒక వెలుగు వెలిగారు.

"""/" / దాదాపు జయలలిత తో కలిసి సీనియర్ ఎన్టీఆర్ 11 చిత్రాలు చేశారు.

ఇక చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే సీనియర్ ఎన్టీఆర్ జయలలిత తల్లి సంధ్య( Sandhya ) తో కూడా సినిమాల్లో నటించారు.

జయలలిత తల్లి సంధ్యతో మాయా బజార్, తెనాలి రామకృష్ణ( Maya Bazar, Tenali Ramakrishna ) వంటి సినిమాల్లో నటించారు.

ఇలా తల్లి కూతుర్లకు ఇద్దరికీ కూడా ఆయన హీరోగా నటించడం విశేషం.ఈ రేర్ ఫీట్ సాధించిన హీరోలలో ఎన్టీఆర్ ప్రప్రధమంగా ఉంటారు.

కైకాల సత్యనారాయణ జీవితంలో ఆసక్తికర సంఘటన.. విషం కూడా వరంగా మారిందే..??