దేశ ప్రధాని NTR సినిమా విడుద‌ల‌ను అవ్వకుండా ఎందుకు అడ్డుకుంది..?

దేశ ప్ర‌ధానమంత్రి ఓ సినిమాను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తారా? అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను స‌మానంగా చూడాల్సిన వ్య‌క్తి ఓ ప్రాంతంపై చిన్న చూపు చూస్తారా? అవున‌నే స‌మాధానం వ‌చ్చింది నాటి ప్ర‌ధాన‌మంత్రి ఇందిరా గాంధీ పాల‌నా స‌మ‌యంలో.

ఓ తెలుగు సినిమాను అడ్డుకున్నార‌నే వార్త‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం అయ్యాయి.అదీ.

తెలుగు సినీ ప‌రిశ్ర‌లో టాప్ హీరోగా కొనసాగుతూ.రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న ఎన్టీఆర్ సినిమా కావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఇంతకీ ఆ సినిమా ఏంటి? నాటి ప్రధాని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం! నాటి దిగ్గజ హీరో ఎన్టీఆర్.

ఓసారి కడప జిల్లాకు వెళ్లారు.అక్కడే ఉన్న శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమాన్ని దర్శించుకున్నారు.

అక్కడి బ్రహ్మం గారి చెక్క చెప్పులు తొడిగారు.అవి ఎన్టీఆర్ కు సరిపోవడంతో ఎంతో సంతోషానికి లోనయ్యారు.

అంతేకాదు.తెర మీది బొమ్మలు ఎప్పుడో ఒకప్పుడు అధికారం లోకి వస్తాయని కాలజ్ఞానంలో చెప్పిన మాటలు ఇంకా నచ్చాయి.

వెంటనే వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రను తెరకెక్కించాలనుకున్నారు.ఏడాది పాటు చక్కటి కథ తయారు చేయించారు.

ఎన్టీఆర్ స్వయంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాలి అనుకున్నారు. """/"/ 1980లో చిత్ర షూటింగ్ మొదలైంది.

ఏడాదిలో పూర్తి అయింది.అయితే ఈ సినిమాలోని కొన్ని అంశాలపై సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

సెన్సార్ బోర్డ్ తీరుపై ఆయన న్యాయ పోరాటం చేశారు.మూడేళ్ల పాటు కోర్టులో కొట్లాడారు.

చివరకు కేసు గెలిచి.1984లో సినిమా విడుదల చేసారు.

అంతేకాదు.సెన్సార్ బోర్డు నిర్ణయం వెనుక నాటి ప్రధాని ఇందిర హస్తం ఉందని విమర్శలు వచ్చాయి.

ఎన్టీఆర్ సీఎం అవుతారని సినిమాలో ఉన్నట్లు.కొందరు నాయకులు ఇందిరాకు చెప్పారట.

అందుకే అడ్డుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపించాయి.ఈ సినిమా ఇందిరా మరణం అనంతరం విడుదల కావడం విశేషం.

ఈ సినిమా విడుదల నాటికి ఎన్టీఆర్ సీఎం అయ్యారు.పార్లమెంట్ లో ఒక ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ ప్రధాన ప్రతిపక్షం గా నిలిచింది.

పరారీలో సినీ నటి కస్తూరి శంకర్… గాలిస్తున్న పోలీసులు?