Sr NTR: ఎన్టీఆర్ లాంగ్ డ్రైవింగ్ చేస్తే రెండు మూడు కుక్కలు, నాలుగైదు కోళ్లు అవుట్ అంతే ..!

సీనియర్ ఎన్టీఆర్ కి (Sr NTR) చాలా గొప్ప అలవాట్లు ఉండేవి.ఆయన జీవనశైలి, మాట తీరు, ఎవరైనా సరే బ్రదర్ అని పలకరించే తత్వం, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం మరోకరు అనుసరించాలన్నా కూడా వీలు లేనివి.

ఆయన షూటింగ్ సమయంలో చాలా గంభీరంగా ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి అందరూ భయపడేవారు, ఏదైనా తెలియక మాట్లాడితే పెద్దాయనకు ఆగ్రహం వస్తుంది ఏమోనని ఎవరికి వారు ఆయనకు దూరంగా ఉండేవారు, అందువల్లే ఆయనకు అత్యంత సన్నిహితులు అతి కొద్ది మందే ఉన్నారు.

కానీ మనసుకు నచ్చిన వారితో గంటల గంటలు మాట్లాడేవారు.శత్రువుకి దూరం, మిత్రునికి సన్నిహితంగా ఉండాలనే సిద్ధాంతాన్ని ఆయన పాటించేవారు.

ఇక కారు డ్రైవింగ్ లో ఎన్టీఆర్ చాలా ఫాస్ట్ గా ఉండేవారు.చండశాసనుడు చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివారు గ్రామమైన దేవరాయాంజాల్ లో ఎక్కువగా జరిగింది.

హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్ తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ లొకేషన్ కి వెళ్లేవారు.

వెనుక సీట్లో అసోసియేట్ డైరెక్టర్ వివి రాజు ,హరికృష్ణ(VV Raju, Harikrishna) కూర్చునే వారు.

స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆయన కారుకు బ్రేక్ వెయ్యకపోగా ఇంకా స్పీడ్ గా డ్రైవ్ చేసేవారు.

"""/" / వెనుక సీట్లో కూర్చున్న వాళ్లు ఎగిరి పడేవారు.వెంటనే ఆయన రివర్స్ వ్యూ మిర్రర్ లోంచి చూస్తూ ఏం రాజుగారు మేం డ్రైవ్ చేస్తుంటే భయంగా ఉందా అని అడిగే వారు.

ఎందుకు ఉండదు సార్, అయినా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బ్రేక్ వెయ్యకపోతే ఎలా సార్ అనేవారు.

దానికి ఎన్టీఆర్ నవ్వేసి మనం అంతేనండి లాంగ్ జర్నీ చేసామంటే రెండు మూడు కుక్కలు, నాలుగైదు కోళ్లు అవుట్ మన దెబ్బకి అని నవ్వే వారట.

"""/" / అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలోనే అంటే ఉదయం 4.

45 నిమిషాలకు తన శ్రీమతి బసవతారకం తో (Basavatarakam) మాట్లాడే వారట.ఎన్టీఆర్ ఇంటి సంగతులు, పిల్లల యోగక్షేమాలు తెలుసుకొని సలహాలు సూచనలు ఇచ్చేవారట.

ఎన్టీఆర్ కున్న మరొక గొప్ప అలవాటు ఏంటంటే ఎక్కడ సన్మానం జరిగినా, దండలు వేసిన ఇంటికి రాగానే అవి భగవంతుని ఫోటోలకు సమర్పించేవారు.

ఈ సన్మానం నాది కాదు మీదే అని భక్తితో నమస్కరించేవారట.

‘మిస్టర్ బచ్చన్ ‘ మూవీ రివ్యూ…రవితేజ కంబ్యాక్ ఇచ్చాడా..?