సీనియర్ ఎన్టీఆర్.. మొదటి సినిమా మన దేశం .. వచ్చిన పారితోషకం ఎంత ?

ఒక సాదాసీదా నటుడుగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఊహించని రీతిలో నటసార్వభౌముడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే.

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నందమూరి తారకరామారావు.

ఇప్పటికీ నందమూరి తారక రామారావు భౌతికంగా అభిమానులందరికీ దూరమైనప్పటికీ ఆయన చేసిన సినిమాలు మాత్రం ఎప్పుడు ప్రేక్షకులకు ఎన్టీఆర్ ను దగ్గర చేస్తూనే ఉంటాయి అని చెప్పాలి.

అయితే ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా ప్రస్థానాన్ని కొనసాగించిన ఎన్టీఆర్ 1949 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన దేశం సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

మనదేశం సినిమా ఎల్.వి.

ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది అని చెప్పాలి.స్వాతంత్రం రాకముందు జరిగే కథాంశంతో ఈ సినిమా తీశారు.

అయితే స్వాతంత్రం రావడానికి మునుపే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారూ.కానీ పూర్తి కావడానికి మాత్రం కాస్త ఎక్కువ సమయం పట్టినట్లు తెలుస్తుంది.

విప్రదాస్ అనే బెంగాలీ నవల ఆధారంగా ఇక మన దేశం అనే సినిమాను రూపొందించారు.

చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రలో నటించారు.ఇక ఎన్టీఆర్ అప్పుడప్పుడే సినిమాల్లోకి వస్తున్న సమయంలో నాగయ్య అప్పటికే పెద్ద హీరోగా కొనసాగుతున్నారు.

ఇక అందరికంటే ఎక్కువ ఆయనకే పారితోషకం ఇచ్చేవారూ.దాదాపు 40 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు.

అయితే ముందుగా ఎన్టీఆర్ ను ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కు అనుకున్నారట.

"""/"/ ఇక అప్పుడు అన్నగారికి అడ్వాన్స్గా 250 రూపాయలు ఇచ్చారట ఆ సినిమా నిర్మాతలు.

ఇందుకు సంబంధించి నిర్మాత కృష్ణవేణి స్వయంగా చెక్కు రాసి ఇచ్చారట.అయితే ఇలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మొదటి చెక్కు అందుకోగానే ఇక ఎన్టీఆర్ కళ్ళల్లో ఆనందం వెలివేరిసిందట.

ఇక ఈ సినిమాకు గాను ఎన్టీఆర్ మొత్తంగా 2000 రూపాయల పారితోషకం అందుకున్నాడట.

ఇలా 2000తో మొదలుపెట్టిన ప్రస్థానాన్ని ఇక అందరికంటే ఎక్కువ పారితోషకం తీసుకున్న హీరోగా రికార్డులు సృష్టించే వరకు ముందుకు నడిపించారు నందమూరి తారక రామారావు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో హైకోర్టుకు బీఆర్ఎస్..!