పక్కన ఉన్న హీరోయిన్స్ ని పొగిడితే ఎన్టీఆర్ ఎలా హర్ట్ అయ్యారో తెలుసా ?
TeluguStop.com
సీనియర్ ఎన్టీఆర్.విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా అప్పట్లో ఎన్టీఆర్ ని ఆరాధ్య దైవం గా భావించేవారు ప్రేక్షకులు.
ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్లకి పరుగులు పెట్టేవారు.సినిమా హిట్టుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ ని చూడ్డానికి ఏ థియేటర్స్ కి వెళ్లేవారు.
అలా ఎన్టీఆర్ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలుస్తూ ఆయన స్టార్ హీరోగా ఎదిగిన ఎదిగాడు.
ఎన్టీఆర్ కి మంచి పేరు తెచ్చిన సినిమాలలో జస్టిస్ చౌదరి సినిమా కూడా ఒకటి.
ఇది 1982లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు శ్రీదేవి, శారదా వంటి నటీమణులు కూడా నటించారు.
జస్టిస్ చౌదరిగా ఎన్టీఆర్ నటన కూడా అద్భుతంగా ఉంది.ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో కనెక్ట్ అయ్యేవారు.
జస్టిస్ చౌదరి సినిమాలో పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి.ప్రతి పాట కూడా ప్రేక్షకుడి చేత స్టెప్పులు వేయిస్తుంది.
ఈ చిత్రానికి ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ్ రావు నిర్మాతగా వ్యవహరించగా, రాఘవేంద్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.
ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లోని ఓ థియేటర్లో 1000 రోజుల పాటు ఆడింది.
అంతేకాదు అనేక థియేటర్లలో వంద రోజులు ఆడి మంచి కలెక్షన్స్ సైతం రాబట్టింది.
ఇక ఈ చిత్రం ఇంత సక్సెస్ కావడంతో దీనికి విజయోత్సవ సభ ఏర్పాటు చేయాలని భావించారు చిత్ర బృందం.
"""/"/
అనుకున్నదే తడవుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ సభను ఏర్పాటు చేశారు.అంతేకాదు ఎన్టీఆర్, శ్రీదేవి, శారదలు గెస్ట్ లుగా కూడా వచ్చారు.
అయితే సభలో వచ్చినవారు కొంతమంది ఎన్టీఆర్ నటన కంటే కూడా శారదా, శ్రీదేవి ల నటన అద్భుతంగా ఉందని కామెంట్స్ చేయడంతో ఎన్టీఆర్ కాస్త ఫీలయ్యారట.
ఆయన స్పీచ్ ఇస్తున్న సందర్భంలో సినిమాలోని అంతరార్దన్ని అర్థం చేసుకోలేదని ఇండైరెక్ట్ గా అక్కడ ఉన్నవారికి చురకలు అంటించారట.
ఇక న్యాయ వ్యవస్థ పై ఈ సినిమా ఎంతో ప్రభావం చూపిస్తుందని అయన భావించినప్పటికీ అలాంటిది జరగకపోవడంతో కూడా ఎన్టీఆర్ హర్ట్ అయ్యారట.
వైరల్: సాక్స్‌లు లేకపోతే ఏం… ఇలా ఎపుడైనా ఆలోచించారా?