ఒకే గదిలో ఉన్న ఎన్టీఆర్ తో రెండేళ్లపాటు మాటలు లేని సంగీత దర్శకుడు

సీనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ రాక ముందు అలాగే వచ్చిన తర్వాత ఎంతో మంది ఆప్తులు ఉన్నారు.

అలాంటి ఒకరిలో చెప్పుకోవాల్సింది అయన రూమ్ మేట్ టి వి రాజు.అయన అస్సలు పేరు తోటకూర వెంకట రాజు.

దాదాపు రాజు గారు మరియు సీనియర్ ఎన్టీఆర్ ఒకేసారి సినిమా అవకాశాల కోసం మద్రాసుకు చేరుకున్నారు.

ఒకే గదిలో ఉంటూ సినిమా ప్రయాణాన్ని కొనసాగించారు.అప్పటి తరం వారికి టి వి రాజు గారంటే ఒక గమ్మత్తయిన విషయం.

తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఆయనొక ఆణిముత్యం.ఎందుకంటే జానపదాల్లో మాడ్రన్ బిట్స్ పెట్టి అందరిని మెస్మరైజ్ చేసేవారు.

అయన సంగీతం అందించిన అన్ని పాటలు కూడా మంచి విజయాన్ని సాదించేవి.సీనియర్ ఎన్టీఆర్ సొంతంగా నిర్మించిన తొలి సినిమాకు కూడా టి వి రాజు తో ఉన్న స్నేహం మరియు అతడి పై ఉన్న నమ్మకంతో సంగీతానికి సంబందించిన బాధ్యతలు అప్పగించారు.

ఆ సినిమా పెద్ద విజయం సాధించకపోయినా రాజు గారి సంగీతం మాత్రం జనాలను బాగానే ఆదరించింది.

ఇక ఎన్టీఆర్ తో పాటు కత్తి కాంతారావు జానపద సినిమాలు వస్తున్నాయంటే అప్పట్లో రాజు గారు మాత్రమే సంగీతం అందించాలని నిర్మాతలు మరియు దర్శకులు కోరుకునే వారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల్లో దాదాపు 60 శాతం సినిమాలకు రాజు గారు మాత్రమే సంగీతం అందించారంటే అయన పాటల స్థాయి ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.

"""/"/ ఇక ఇంత మంచి స్నేహితులు అయినా ఎన్టీఆర్ మరియు రాజు గారు ఒక రెండేళ్ళ పాటు కొన్ని కారణాల వలన కలుసుకోవడం మరియు మాట్లాడుకోవడం వంటివి చేయలేదట.

ఆ టైంలోనే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అయినా రామకృష్ణ అనారోగ్యంతో కన్ను మూసారు.

దాంతో పలకరించడానికి వెళ్లిన రాజు గారు ఎన్టీఆర్ ని వదిలేసి రాలేకపోయారు.అక్కడే కొన్నాళ్ల పాటు ఉంటూ ఆ తర్వాత పాత విషయాలు ఏమి మనసులో పెట్టుకోకుండా తల్లా పెళ్ళామా అనే సినిమా కోసం ఇద్దరు కలిసి పని చేశారట.

ఆలా మళ్లి పాత స్నేహితులు మళ్లి తమ జనాన్ని కొనసాగించారట.

ఇండియాలో ఎవ్వరికి లేని క్రేజ్ ను సంపాదించుకున్న తెలుగు డైరెక్టర్స్…