నీ లక్ష్మీ వెళ్ళిపోయింది అంటూ.. రాజనాల తో ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఎందుకో తెలుసా?
TeluguStop.com
ప్రస్తుతం విలన్ పాత్రలు పోషించేందుకు ఎంతోమంది ఉన్నారు.ఇతర భాషల నుంచి వచ్చి మరీ నటిస్తున్నారు నేటి రోజుల్లో.
కానీ ఒకప్పుడు ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన నటుడు రాజనాల.
ఇక ఆయన నటించిన విలన్ పాత్రలు అటు ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో కనెక్ట్ అయిపోయాయి అని చెప్పాలి.
కేవలం విలన్ పాత్ర లోనే కాకుండా ఎన్నో పాత్రల్లో నటించారు రాజనాల.కానీ ప్రేక్షకులకు మాత్రం విలన్ పాత్రలే బాగా కనెక్ట్ అయ్యాయి.
అయితే అటు నందమూరి తారక రామారావు రాజనాల మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది అని చెప్పాలి.
వీరిద్దరూ కలిసి వద్దంటే డబ్బు అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించారు.ఈ సినిమాలో నందమూరి తారక రామారావు మామ పాత్రలో నటించాడు రాజనాల.
షూటింగ్ సమయంలో ఇక రాజనాల ను మామాజీ అని పిలవడం మొదలు పెట్టాడు ఎన్టీఆర్.
సినిమా షూటింగ్ పూర్తయిన ఈ పిలుపు మాత్రం ఆగలేదు.ఇక అప్పటినుంచి మామాజీ అనే పిలుపుతోనే వీరి బంధం కంటిన్యూ అయ్యింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన జై సింహా సినిమాలో విలన్ పాత్రను పోషించాడు రాజనాల.
ఇక ఈ పాత్రకు ప్రాణం పోసిన తీరు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. """/" /
తర్వాత రాజనాల దగ్గరికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి అని చెప్పాలి.
ఇలా తెలుగులో మాత్రమే కాదు హిందీ కన్నడ భాషల్లో కూడా నటించారు.ఇక హాలీవుడ్ కూడా నటించడం గమనార్హం.
కెరియర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక విషాదకర ఘటన.32 ఏళ్ళకే రాజనాల భార్య కన్నుమూసింది.
అప్పటికి ఆయనకి చిన్న పిల్లలు కూడా ఉన్నారు.ఇక ఆమెతోనే అదృష్టం కలిసివచ్చింది రాజనాల చెప్పేవారు.
అయితే ఈ సమయంలో ఇక ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన ఎన్టీఆర్ నీ లక్ష్మి వెళ్లి పోయింది మామ అంటు కన్నీళ్లు పెట్టుకున్నారు.
"""/" /
ఆ తర్వాత ఎన్నో రోజుల పాటు నైరాశ్యంలో సంవత్సరంన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు తర్వాత పిల్లల కోసం భూదేవిని రెండో వివాహం చేసుకున్నారు.
తర్వాత సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.తర్వాత అవకాశాలు కూడా తక్కువ అయ్యాయి.
చివరగా తెలుగువీర లేవరా అనే సినిమాలో నటించారు.చివరికి అనారోగ్యంతో మృతి చెందారు.
అయితే హాస్పిటల్ బిల్లు ఒక లక్షా ఎనభై వేల అయితే అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున ఈ బిల్లును కట్టడం గమనార్హం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు తీపికబురు.. వార్2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ అప్పుడేనా?