తండ్రి కొడుకులు కలిసి చూడాల్సిన సినిమా ఇది!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా తెరకెక్కించాలంటేనే ఎంతో కష్టంతో కూడుకున్నది.అలాంటివి సినిమా తెరకెక్కించి ఆ సినిమా థియేటర్లో విడుదల చేయాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంది.

ఈ విధంగా సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఆ కష్టాలను అధిగమిస్తూ ఎట్టకేలకు థియేటర్ లో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది‘ఎస్‌.

ఆర్‌.కల్యాణమండపం’.

శ్రీధర్ గాదె దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా ఆగస్టు 6న థియేటర్ లోకి రావడం చేత చిత్రబృందం హైదరాబాదులో ముందస్తు వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు తరుణ్ భాస్కర్, అవసరాల శ్రీనివాస్, హీరో అల్లరి నరేష్, హీరో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకలో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.ఈ సినిమాను ఒక మధ్యతరగతి వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించామని, ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఏ విషయంలోనూ భయపడకుండా, అన్ని సాధించాలనే కాన్సెప్టుతో తెరకెక్కించినట్లు తెలిపారు.

"""/"/ ఈ సినిమా మొత్తం ఒక కళ్యాణ మండపం చుట్టూ తిరుగుతుందని, ఈ క్రమంలోనే తండ్రీ కొడుకుల మధ్య ఉన్న గొప్పతనం ఎంతో అద్భుతంగా చూపించామని తెలిపారు.

ఈ సినిమా తండ్రి కొడుకులిద్దరు కలిసి చూసే సినిమా అని దర్శకుడు తెలిపారు.

ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో సాయి కుమార్ కీలక పాత్రలో నటించారు.

తెలంగాణ ఎంసెట్ ర్యాంకర్ ను మెచ్చుకున్న సమంత.. నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ?