శంకరాభరణం సినిమాకు రాజ్యలక్ష్మికి అంత రెమ్యునరేషన్ ఇచ్చారా.. అప్పట్లోనే రికార్డ్?

గుంటూరు జిల్లా తెనాలి లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, 1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు కె.

విశ్వనాధ్ గారు శంకరాభరణం సినిమాలో నాయిక కోసం వెతుకుతున్నారని తెలిసి తల్లితో పాటు చెన్నై వెళ్ళి ఆయనను కలిసిన నటి రాజ్యక్ష్మి.

ఆయన తన చిత్రం లోని శారద పాత్ర కోసం చూస్తున్నపుడు, ఈమె ఆ పాత్రకు సరిపోతుందని నమ్మి ఈమెను ఎంచుకున్నారు.

ఆ తర్వాత ఈ చిత్రం ఘనవిజయం సాధించాక తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలలో ఆమె నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆమె నాయికగా దాదాపు 20 చిత్రాలలో నటించారు.ఈవిడ నటించిన చిత్రాలలో నెలవంక, చెవిలో పువ్వు, జస్టిస్ చౌదరి, అభినందన, వివాహభోజనంబు, అభిలాష, పసివాడి ప్రాణం, జననీ జన్మభూమి చిత్రాలు ఈమెకు ఎంతో పేరు తెచ్చాయి.

ఇకపోతే పాత ఆర్టిస్ట్ లకు ఒకప్పుడు ఉన్న గౌరవం, మర్యాద ఇప్పుడు కూడా ఉన్నాయనే తాను నమ్ముతున్నట్టు ఆర్టిస్ట్ రాజ్య లక్ష్మి చెప్పారు.

తనకెప్పుడూ అలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదని ఆమె స్పష్టం చేశారు.సినిమాకి, సీరియల్స్ కి తన విషయానికొస్తే ఎలాంటి తేడా లేదని ఆమె అన్నారు.

తాను ఒక టైం చెప్తే అంత వరకే చేసేదానినని, అంత కన్నా ఎక్కువ సేపు చెయ్యడం తన వల్ల కానిదని రాజ్యలక్ష్మి చెప్పారు.

"""/"/ ఇక రెమ్యునరేషన్ విషయానికొస్తే సినిమాకి, సీరియల్స్ కి అంత తేడా ఏం లేకపోవచ్చు అని ఆమె తెలిపారు.

కానీ తాను చేసిన శంకరాభరణం సినిమాకి తనకు అప్పట్లోనే 5 వేల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని ఆమె చెప్పారు.

అది ఆ రోజుల్లో చాలా ఎక్కువని ఆమె వివరించారు.అప్పుడు 500 రూపాయలకే టూ బెడ్రూం, 3 బెడ్రూం హౌసెస్ దొరికేవి అని ఆమె చెప్పుకొచ్చారు.

ఉభయ గోదావరి జిల్లాలపై చంద్రబాబు వరుస సమీక్షలు