స్పైడర్ మళ్ళీ లీక్ బారిన పడింది, భయంలో పంపిణిదారులు

స్పైడర్ కి సంబంధించి ఏదైనా ఒక్క మంచి విషయం ఈ మధ్య జరిగిందా అంటే అసలేం జరిగిందో ఎవరికీ తట్టట్లేదు.

160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అని గొప్పలు చెప్పుకోవడానికి కూడా లేదు.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగేలా ఉంది.

అంటే స్పైడర్ బిజినెస్ కూడా ఆ సినిమా స్థాయికి తగ్గట్టుగా జరగలేదు అన్నమాట.

సరే, బిజినెస్ ఎప్పుడో మొదలైంది కాబట్టి, ఏ పెద్ద హీరో బిజినెస్ ని మరో పెద్ద హీరో సినిమా కొట్టడం కామన్ కాబట్టి, రేపు భరత్ అనే నేను ఆ రికార్డుని కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఈ టాపిక్ వదిలేద్దాం.

ఒక్కటంటే ఒక్క పోస్టర్ కూడా ఎవరిని ఆకట్టుకోలేకపోయింది.అవి ఇటు తెలుగు సినిమా పోస్టర్స్ లా లేవు, అటు హాలివుడ్ స్థాయిలో లేవు.

టీజర్ రిలీజ్ కి ముందే లీక్.ఇంకేం వస్తాయి యూట్యూబ్ రికార్డులు.

ట్రైలర్ ఇవాలా ఫంక్షన్ లో రిలీజ్ చేద్దామనుకుంటే అది కూడా నిన్న రాత్రే లీక్.

దాంతో చేసేదేమీ లేక, అర్థరాత్రి సడెన్ గా ట్రైలర్ ని విడుదల చేసారు.

!--nextpage ఓ వైపు ఎన్టీఆర్ పధ్ధతి ప్లానింగ్ తో యూట్యూబ్ రికార్డులు కొడుతోంటే, మహేష్ టీజర్లు, ట్రైలర్లు విడుదలకి ఓ రోజు ముందే లీక్ అవుతూ ఆసక్తిని తగ్గిస్తున్నాయి.

పోనీ వాటి అవుట్ పుట్ అయినా అంచనాలను అందుకునేలా ఉందా అంటే అది కూడా లేదు.

రాత్రి వదిలిన ట్రైలర్ కి కూడా నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది.ఇదే పద్ధతి కంటిన్యూ అయితే రేపు సినిమా లీక్ అయినా లీక్ అవొచ్చు.

120 కోట్లు పెట్టి తీసిన సినిమాకి సెక్యూరిటి లేకుండాపోయింది.స్పైడర్ కి హైప్ రావాలంటే అధ్బుతమైనా జరగాలి, లేదంటే మహేష్ బాబే లాగాలి.

ఇక ఎన్టీఆర్ మాత్రం దూసుకుపోతున్నాడు.ఉదాహారణకు చెప్పాలంటే, గుంటూరు సి,డి సెంటర్స్ లో జై లవ కుశని 1.

53 కోట్లకు కొంటె, స్పైడర్ ని 1.17 కోట్లకు కొన్నారు.

మాస్ సెంటర్స్ లో పరిస్థితి ఇలానే ఉంది.మాస్ సినిమా కావడంతో లోకల్ పంపిణిదారులు తాపిగా ఉన్నారు.

వారి స్పందన పాజిటివ్ గా ఉంది.ఇక స్పైడర్ అటు పూర్తిగా హాలివుడ్ సినిమా కాకుండా, ఇటు పూర్తిగా తెలుగు సినిమా కాకుండా, మధ్యలో కొట్టుమిట్టాడే సినిమాలా కనిపిస్తోంది పంపిణిదారులకు.

చెమటలు పడుతున్నాయి వారికి.ఇలాంటి పరిస్థితుల్లో సినిమా కూడా లీక్ అయితే ఆ కష్టాలు ఊహించడానికి కూడా మనం కష్టపడాలి.

రోడ్డు దాటుతూ వాహనదారులకు కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి.. ఆనంద్‌ మహీంద్రా రియాక్షన్ ఏంటంటే..