హెచ్‌-4 వీసా ప్రక్రియలో జాప్యం: ఆవిరవుతున్న ఆశలు... ఒబామాకు భారతీయ మహిళల వినతులు

అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్ల లోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్‌-4 వీసాల జారీలో సుదీర్ఘ జాప్యం చోటుచేసుకుంటుండటంపై అక్కడి ప్రవాస భారతీయ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇందుకు నిరసనగా కొద్దిరోజుల క్రితం కాలిఫోర్నియాలోని శాన్‌ జోస్‌లో 'సేవ్‌ హెచ్‌4ఈఏడీ' పేరుతో ర్యాలీ నిర్వహించారు.

నైపుణ్యమున్న చట్టబద్ధమైన వలసదారులుగా సమాజానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేయూతను అందించామని అలాంటి తమ ఉద్యోగాల రెన్యువల్‌కు అనుమతి ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు.

దీనివల్ల వేల సంఖ్యలో విదేశీయులు, ముఖ్యంగా భారతీయ మహిళలు ఉపాధికి దూరమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్‌1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అది లభించడానికి సుమారు 15 ఏళ్లు పడుతుంది.

ఈలోగా హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామి అమెరికాలో ఉద్యోగంలో చేయడానికి అనుమతి ఉండేది కాదు.

వీరి ఆవేదనను అర్ధం చేసుకున్న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 2015లో హెచ్ 4 ఈఏడీ (ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌) బిల్లు తెచ్చారు.

దీని ప్రకారం హెచ్‌1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న వారి జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించారు.

దీనికి అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలపింది.దీనివల్ల 1.

34 లక్షల మంది భారతీయ మహిళలు యూఎస్‌సీఐఎస్‌ నుంచి ఈఏడీ పొంది తమకు నచ్చిన ఉద్యోగాల్లో చేరారు.

"""/"/ జీవిత భాగస్వామి హెచ్‌1బీ గడువుకు అనుగుణంగా హెచ్‌4 వీసా రెన్యూవల్‌ చేస్తారు.

అయితే ఏడాదిన్నరగా కరోనా తదితర కారణాలతో యూఎస్‌సీఐఎస్‌ ఈఏడీ రెన్యూవల్‌ చేయట్లేదు.దీంతో మార్చి 31 నాటికి సుమారు 91 వేల మంది భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి వారి కుటుంబాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

దీనిపై భారతీయులు పలు కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేసి న్యాయపోరాటం సైతం చేస్తున్నారు.

అలాగే హెచ్ 1 వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు ఈఏడీ వెసులుబాటు కల్పించిన బరాక్ ఒబామానే దీనిపై స్పందించి తమకు న్యాయం చేయాల్సిందిగా వారు కోరుతున్నారు.

ఈ మేరకు ప్రతిరోజూ ఆయనకు వేలాది మెయిల్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.

కల్కి2 మూవీలో కల్కి రోల్ లో జూనియర్ ఎన్టీఆర్.. అదే జరిగితే బాక్సాఫీస్ షేకవుతుందా?