క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) రాష్ట్రమ్ లోని అయోధ్యలో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగే ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ కు ఎంపికైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులను సాగనంపెందుకు వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల( Vemulawada Govt Junior College ) మైదానం లో శుక్రవారం ఉదయం 7.

30గంటలకు జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ , వేములవాడ శాస నసభ్యులు అది శ్రీనివాస్( Aadi Srinivas ).

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ , వేములవాడ ఎం ఎల్ ఏ అది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉందని చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు .

జిల్లాలో మాస్టర్ అథ్లెట్స్ అంతర్జాతీయ క్రీడల్లో పాలుపంచుకోవడం అభినందనీయం .క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి .

యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని, క్రీడల్లో ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, అదే స్ఫూర్తి ని నిజ జీవితంలో అలవర్చుకుంటు ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.

క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా,ఆరోగ్యం గా దృడంగా ఉండడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని అన్నారు.

నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని అన్నారు.

క్రీడ ఓటమి చెందిన వారు తమ లోపాలను సవరించుకొని ముందుకు వెళ్లడం అలవర్చుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ అన్నారం శ్రీనివాస్, క్రీడాకారులు రాజన్న సిరిసిల్ల జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ కార్యదర్శి జి .

శేఖర్ , జాయింట్ సెక్రెటరీ చింతలపల్లి మునిందర్ రెడ్డి పెద్దపల్లి కార్యదర్శి కె .

మహేందర్ రెడ్డి అథ్లెట్స్ కమఠం రామానుజమ్మ , నాయిని శంకర్ అబ్దుల్ పఠాన్, లక్ష్మణ్ ,కమల్ జవ్వాజి లక్ష్మణ్ లు పాల్గొన్నారు.

తమ్ముడు సినిమా శివరాత్రి కి వస్తుంది…సక్సెస్ అవుతుందా..?