కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టడం మన సాంప్రదాయంగా భావిస్తాం.

అలాగే గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి కొబ్బరికాయ ను కొట్టి మన కోర్కెలు తీర్చమని దేవుడిని వేడుకుంటారు.

అయితే కొన్నిసార్లు కొబ్బరికాయ కొట్టినప్పుడు కొందరికి పువ్వు వస్తుంది.కొన్నిసార్లు కొబ్బరికాయ కుళ్ళిపోతుంది.

అలా కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతూ ఉంటారు.కొబ్బరికాయ కుళ్ళిపోవడం దేనికి సంకేతం? కొబ్బరికాయ కుళ్ళిపోతే శుభమా? అశుభమా? కుళ్ళిన కొబ్బరికాయ వస్తే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మనకి ప్రత్యేకమైన రోజు లేదా పండుగ రోజు ప్రతి ఒక్కరు గుడికి వెళ్లి దేవునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పిస్తుంటారు.

అయితే కొన్నిసార్లు కొబ్బరికాయ చెడిపోవడం జరుగుతుంది.అలా కొబ్బరి కాయ చేయకపోవడం వల్ల మనసులో తెలియని అలజడి ఆందోళన మొదలవుతుంది.

కొబ్బరికాయ చెడిపోవడం ఏదైనా చెడు జరుగుతుందేమోనని భయపడుతుంటారు.ఇలాంటి భయాలు కేవలం అపోహ మాత్రమే.

సాధారణంగా మనం కొబ్బరికాయను మనలోని ఈర్ష, కోపం, కల్మషం తొలగిపోయి తెల్లని కొబ్బరి వలె మన మనసు కూడా ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉండాలని దేవుని ముందు కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తాము.

అయితే కొబ్బరికాయ చెడిపోవడం వల్ల ఎలాంటి అశుభాలు జరగవు.మనలో ఉన్న చెడు ఆలోచనలు మొత్తం ఆ కొబ్బరికాయ ద్వారా నశించిపోతాయి అని పండితులు చెబుతున్నారు.

అలా కొబ్బరికాయ చెడిపోయినప్పుడు మరి ఎలా స్నానం చేసి, దాని స్థానంలో ఇంకొక కొబ్బరికాయను కొట్టడం వల్ల శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనానికి తీసిన కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు, వాహనం మొత్తం మరొకసారి శుభ్రం చేసే, మరొక టెంకాయ దిష్టి తీసి పెట్టడం వల్ల, మన ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి.

వివాహం కాని వారికి కొబ్బరికాయలో పువ్వు రావడం వల్ల వివాహ ఘడియలు దగ్గర వస్తున్నాయని సంకేతం.

అంతేకాకుండా కొబ్బరికాయ నిలువుగా పగలడం వల్ల వారికి సంతానం తొందరగా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఎండాకాలంలో షుగర్ ఉన్నవారు.. చెరుకు రసం తాగితే జరిగేది ఇదే..!