అమెరికాలో పుట్టి... ఆధ్యాత్మిక గురువుగా మారి: అనారోగ్యంతో బాబా రామ్‌దాస్ మృతి

అమెరికాలో పుట్టి భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావనల పట్ల ఆకర్షితుడైన మనోధర్మ నిపుణుడు, ఆధ్యాత్మిక గురువు, మేధావి బాబా రామ్‌దాస్ అలియాస్ రిచర్డ్ ఆల్పెర్ట్ కన్నుమూశారు.

గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం హవాయి మౌయిలోని తన నివాసంలో మరణించారు.

1931 ఏప్రిల్ 6న బోస్టన్‌లో జన్మించిన ఆయన టఫ్ట్స్ వర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, వెస్లియన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ మరియు స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి మనస్తత్వ శాస్త్రంలో డాక్టరేట్ పొందారు.

"""/" / 1960లో ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీలో ఆల్ఫ్రెడ్ బోధన చేస్తున్నప్పుడు, సహోద్యోగి మనస్తత్వ వేత్త తిమోతి లియరీతో సన్నిహితంగా మెలిగేవారు.

ఈ క్రమంలో వీరిద్దరూ ఎల్ఎస్‌డీపై ప్రయోగాలు చేయడం ప్రారంభించారు.అయితే మానసిక ఔషధాలపై ప్రయోగం చేసినందుకు 1963లో ఆల్పెర్ట్, లియరీలను హార్వర్డ్ నుంచి తొలగించారు.

"""/" / 1967లో ఆల్పెర్ట్ భారతదేశ యాత్రకు వచ్చి.మహారాజ్జీ అని పిలవబడే తన ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబాను కలిసి తర్వాత బాబా రామ్‌దాస్‌గా అమెరికాకు తిరిగి వెళ్లారు.

పూర్తిగా ఆధ్యాత్మిక గురువుగా మారిన రిచర్డ్.హిందూ, బౌద్ధం, సూఫీ, యూదుల ఆధ్యాత్మికతను కలిపి కొత్త దారులను అన్వేషించారు.

ఆయన రచించిన ‘‘బీ హియర్ నౌ’’తో సహా అనేక పుస్తకాలు వంద శాతం సమయం ఆనందంగా ఎలా జీవించాలో చెబుతాయి.

లిథర్జిక్ యూసిడ్ డైఇథైల్‌మైడ్ వాడకంతో దీర్ఘకాల వ్యాధులను నయం చేయడంతో పాటు వృద్ధాప్య సమస్యలను పరిష్కరించేందుకు రామ్ దాస్ అనేక ప్రయోగాలు చేశారు.

సేవ ఫౌండేషన్‌కు సహా వ్యవస్థాపకునిగా పనిచేసిన రామ్‌దాస్.అమెరికన్లకు ఆరోగ్య సంరక్షణను అందించేందుకు కృషి చేస్తోంది.

అంతేకాకుండా భారత్, నేపాల్‌లో అంధత్వ నిర్మూలనకు కృషి చేస్తోంది.

ఆ స్టార్ హీరోయిన్ కు రామ్ చరణ్ తెలుగు నేర్పించాడా.. ఏం జరిగిందంటే?