అంబానీ కుటుంబానికి ‘స్పైడర్ మ్యాన్’ థాంక్స్ చెప్పాడు… ఎలాగంటే?

స్పైడర్ మాన్( Spider-Man ).ఈపేరు తెలియని జనాలు దాదాపుగా ఉండనే ఉండరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.

స్పైడర్ మాన్ అనేవాడు 'మార్వెల్ కామిక్స్'( Marvel Comics ) ప్రచురించిన అమెరికన్ కామిక్ పుస్తకాలలో కనిపించే ఓ సూపర్ హీరో.

రచయిత స్టాన్ లీ రూపొందించిన ఈ పాత్ర ప్రపంచ జనాలను ఎంతగానో రంజింపజేసింది.

దాంతో ఈ కామిక్స్ నే సినిమాలుగా తెరకెక్కించి కోట్ల రూపాయిలు కొల్లగొట్టారు.ఈ స్పైడర్ మాన్ అనే మూలకథలో, ఓ రేడియోధార్మిక సాలీడు కరవడంతో అందులోని ప్రధాన పాత్ర స్పైడర్ మాన్ లాగ మారిపోతుంది.

అక్కడితో కథ ఆరంభం అవుతుంది. """/" / కామిక్స్ లో హిట్టైన ఈ పాత్ర విండితెరపై కూడా పెను సంచలనాలు సృష్టించింది.

మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ పాత్ర బాగా ఎక్కేసింది.ఇప్పటికీ ఎవరినైనా చిన్నపిల్లల్ని అడిగి చూడండి.

మీ సూపర్ హీరో ఎవరని? ఠక్కున తడుముకోకుండా వారు స్పైడర్ మేన్ అని సమాధానం చెబుతారు.

అంతలా ఈ పాత్ర జనాల్లోకి దూసుకుపోయింది.దాంతో స్పైడర్ మేన్ సిరీస్( Spider-Man Series ) చాలానే వచ్చాయి.

ఇంచుమించుగా రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సిరీస్లో ఒక సినిమా అయినా రూపుదిద్దుకుంటుంది.

"""/" / ఇక అసలు విషయంలోకి వెళితే, ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం అతిరథమహారధుల మధ్యన ఎంతో అట్టహాసంగా జరగబోతుంది.

ఈ ఈవేంట్‌కు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని సినీ ఇండస్ట్రీల నటీనటులకు ఆహ్వానం అందింది.

ఈ క్రమంలోనే హాలీవుడ్ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' స్టార్ టామ్ హాలండ్ హాజరవ్వడం జరిగింది.

దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హాలండ్.

"NMACC ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అంబానీ కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.నేను ఎప్పటికీ మరచిపోలేని అద్భుతమైన అనుభవం.

" అని రాసుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా సెట్ చేయబోతున్న స్టార్ ప్రొడ్యూసర్…