6 మిలియన్ ఎస్ హెచ్‌యూలే. """/" /
అయితే ఇపుడు మించిపోయిన ఘాటు దీనికి ఉండబట్టే పాత రికార్డులను చెరిపేసి.
గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది.ఇక్కడ మరో విశేషం ఏమిటో తెలుసా? కరోలినా రీపర్ చిల్లీ, పెప్పర్ ఎక్స్‌ను సాగు చేసింది ఒకరే మరి.
పకర్బట్ పెప్పర్ కంపెనీ వ్యవస్థాపకుడు, దక్షిణ కరోలినాకు చెందిన ఎడ్ కర్రీ( Ed Currie ) అత్యంత ఘాటైన మిర్చి రకాలను పండిస్తుంటారని మీరు ఎక్కడో ఒకచోట వినే వుంటారు.
పెప్పర్ ఎక్స్‌ను సాగు చేయడం ద్వారా అత్యంత ఘాటైన మిరప తన రికార్డును తానే అధిగమించినట్టయింది.
ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ ఘాటైన మిర్చి రకాన్నిసృష్టించానని ఎడ్ కర్రీ చెబుతున్నారు.
అయితే ఇంతవరకు బయటపెట్టలేదు.కరోలినా రీపర్( Carolina Reaper ) మిర్చి కన్నా ఘాటైన రకాన్ని ఇతరులెవరైనా పండిస్తారా? అని ఆయన ఎదురుచూశారట.
"""/" /
కాగా పదేళ్లుగా అదే రికార్డు కొనసాగుతూ వుండడంతో పెప్సర్ ఎక్స్ ను బయటపెట్టక తప్పలేదు.
కాప్సేసిన్ అనే పదార్థం వల్ల మిర్చికి ఘాటు వస్తుంది.కాప్సేసిన్ మోతాదు పెరిగే కొద్దీ మిరప మంట పెరుగుతుంటుందన్నమాట.
ఈ ఘాటును స్కోవిల్లే స్కేల్‌తో కొలుస్తారు.ఫార్మకాలజిస్టు విల్బర్ స్కోవిల్లే దీనిని 1912లో ఆవిష్కరించారు.
మిరప ఘాటును పూర్తిగా తగ్గించడానికి ఎంత నీరు అవసరం అవుతుందన్నది ఈ స్కేల్ ద్వారా లెక్కిస్తారు.
పెప్సర్ ఎక్స్ ను పదేళ్లుగా సాగు చేస్తున్నట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు కూడా తెలిపారు.
ఇంత ఘాటైన మిర్చి ఆవిష్కరణ కోసం ఎడ్ కర్రీ.హైబ్రిడ్ పద్ధతిని అనుసరించడం గమనార్హం.
వైరల్ వీడియో: స్టేజిపై డాన్స్ తో అదరగొట్టిన మోనాలిసా