గుండెపోటుతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నందికొండ డ్యామ్ నందు విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ నాగరాజు( SPF Constable Nagaraju ) సోమవారం గుండెపోటుతో మరణించారు.

గుండెపోటుతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి

డ్యాం ఎస్పీఎఫ్ ఆర్ఐ భాస్కర్ రెడ్డి ( Dam SPF RI Bhaskar Reddy )తెలిపిన వివరాలు ప్రకారం.

గుండెపోటుతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి

2018 బ్యాచ్ కి చెందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కె.నాగరాజు డ్యాంపైన విధులు నిర్వహిస్తుండగా చాతిలో నొప్పి రావడంతో గమనించిన సిబ్బంది హుటాహుటినా స్థానిక కమలా నెహ్రూ ఏరియా దవాఖానకు తరలించారు.

చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.గుండెపోటుతో మరణించినట్లుగా డాక్టరు నిర్ధారించారు.

పోస్టమార్టం అనంతరం పార్ధవదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.ప్రభుత్వం నుండి దహన సంస్కరాల నిమిత్తం రూ.

20 వేలను డ్యాం ఆర్ఐ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఇతడిది స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కాగా,ఇటీవలే ఇతనికి వివాహం కావడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్.. పుట్టినరోజున ఆ సినిమా రిలీజ్ కానుందా?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్.. పుట్టినరోజున ఆ సినిమా రిలీజ్ కానుందా?