ఇలినాయిస్ విద్యార్ధులకు స్పెల్లింగ్ బీ పోటీలు

అమెరికాలోని ఇలినాయిస్‌ విద్యార్ధుల ప్రతిభను ప్రపంచానికి చాటే పోటీలను ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా విద్యార్ధులచే అతి క్లిష్టమైన పదాల స్పెల్లింగ్‌ను వారితో సరిగా పలికించే పోటీలను నిర్వహించేందుకు మరో వేదికను సిద్ధం చేశారు.

ఇలినాయిస్‌లోని పాలాటైన్ పబ్లిక్ లైబ్రరీ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి./br తెలుగు మాట్లాడండి - తెలుగు మాట్లాడించండి అనే నినాదంతో ఇలినాయిస్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పెల్లింగ్ బీ మరియు మాథ్ బీ పోటీలు నిర్వహిస్తున్నారు.

నార్త్ సౌత్ ఫౌండేషన్ ప్రోత్సాహంతో ఈ పోటీలను ఫిబ్రవరి 22న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

కాగా అసోసియేషన్ సభ్యులైన పోటీదారులు ఈ పోటీలో ఉచితంగా పాల్గొనవచ్చు.మిగతావారు ప్రతి పోటీకి $10 చొప్పున ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

"-vertical""/"/ పాలాటైన్ పబ్లిక్ లైబ్రరీ‌ వేదికగా జరగబోయే ఈ పోటీలలో స్పెల్లింగ్ బీ ఉదయం 9 గం.

నుండి మధ్యాహ్నం 12 గం.వరకు నిర్వహిస్తుండగా, మాథ్ బీ పోటీలను మధ్యాహ్నం 1 గం.

నుండి 3.30 గం.

ల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మధ్యాహ్న భోజన సమయం 12 నుండి 1.

గం వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.ఈ పోటీలకు మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను చూడాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు.

బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’..: సీఎం రేవంత్ రెడ్డి