దేవర కథ గురించి వైరల్ వార్తల్లో నిజమెంత.. కొరటాల ఆ తప్పు చేసే ఛాన్స్ లేదా?
TeluguStop.com
మామూలుగా సినిమాలు విడుదల అయ్యే ముందు సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు విడుదల చేయడం అన్నది సహజం.
అదే కొంతమంది ట్రైలర్లో కథను రివీల్ చేస్తే మరికొందరు చేయరు.ఈ మధ్య కాలంలో విడుదల అయ్యే ట్రైలర్లలో చాలా వరకు కథను రిలీజ్ చేస్తున్నారు.
సినిమా విడుదలకు ముందే ట్రైలర్ రూపంలో కథను విడుదల చేస్తూ ప్రేక్షకులలో ఎగ్జైటింగ్ ని పెంచుతున్నారు.
కానీ ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ దేవర సినిమా( Devara Movie) ట్రైలర్ ను చూసిన చాలామంది ప్రేక్షకులు ఎవరికి వారు రకరకాల కథలను అల్లేస్తున్నారు.
"""/" /
ఇటీవల కాలంలో ఒక ట్రైలర్ చూసిన తర్వాత కథ ఏమిటి అనేది అంచనా వేసి చెప్పడం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అన్నది బాగా అలవాటు అయిపోయింది.
ఇటీవల దేవర సినిమా ట్రైలర్ ని చూసిన ప్రేక్షకులు రకరకాల కథలను అల్లేస్తున్నారు.
సముద్రం మీద అధిపత్యం, ఒకటే ముఠా రెండుగా విడిపోవడం, ఇలా రకరకాల కథలు సోషల్ మీడియా నిండా దర్శనమిస్తున్నాయి.
కానీ కొరటాల శివ ఏమీ అషామాషీ డైరక్టర్ కాదు.ట్రయిలర్ లో ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా దాచిన కథ చాలా పెద్దదే.
పెద్ద కథ కనుకే రెండు భాగాలు చేయాలని మొదటే డిసైడ్ అయ్యారు.అంటే చాలా పెద్ద కథ వున్నట్లు.
""<img Src="https://telugustop!--com/wp-content/uploads/2024
మొదట్లో ఇంటర్వెల్ అనుకున్నది ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఎండ్ గా మార్చారని టాక్.
అంటే ఫస్ట్ హాఫ్ లో చెప్పాల్సింది, రెండు హాఫ్ లకు స్ప్రెడ్ చేసారన్న మాట.
ఇందులో రెండో ఎన్టీఆర్ ( Jr Ntr )పాత్ర కన్నా పెద్ద ఎన్టీఆర్ పాత్ర ఎక్కువగా వుంటుందట.
ఇలా చెప్పడానికి పెద్దగా మేథమెటిక్స్ అవసరం లేదు.ఎందుకంటే రెండో భాగంలో కీలకం ఈ రెండో పాత్రనే కదా.
కేవలం గ్రూపు తగాదాలు, చంపడాలు, చిన్న లవ్ స్టోరీ, క్లయిమాక్స్ అంటే అది కొరటాల శివ(
Koratala Shiva ) ఎందుకు అవుతారు.
చాలా పెద్ద కథే అల్లి వుంటారు.కథ కన్నా కూడా బలమైన సీన్లు అల్లి వుంటారు.
అందువల్ల ట్రయిలర్ లో మొత్తం కథ చెప్పేసారు కొరటాల అని అనుకోవడానికి లేదు.
మరి అసలు కథ ఏమిటి అన్నది తెలియాలి అంటే ఈ నెల 27 వరకు వేచి చూడాల్సిందే మరి.
జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలా.. అయితే ఈ సీరంను ట్రై చేయండి!