శాకుంతలంలో అనుష్క.. అసలు ట్విస్ట్ ఇదే..!

సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా శాకుంతలం.

మైథలాజికల్ స్టోరీతో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ లో చేస్తున్నారు.ఈ సినిమాలో సమంత తన నటనతో అందరిని మెప్పిస్తుందని అంటున్నారు.

అయితే శాకుంతలం సినిమాలో సమంతతో పాటుగా అనుష్క కూడా ఉందని కొన్ని వార్తలు వచ్చాయి.

అంతేకాదు శాకుంతలం నిర్మాత నీలిమ గుణ అనుష్కకి థ్యాంక్స్ అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే శాకుంతలం సినిమాలో అనుష్క నటించలేదు.కానీ ఆ సినిమాకు సపోర్ట్ గా నిలిచినందుకు ఆమెకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు నిర్మాత నీలిమ గుణ.

గుణశేఖర్ తో రుద్రమదేవి సినిమా చేసిన టైం నుంచి ఆయనతో ఆయన టీం తో అనుష్క క్లోజ్ గా ఉంటూ వస్తుంది.

ఈ క్రమంలో సమంతతో చేస్తున్న శాకుంతలం సినిమా విషయంలో కూడా అనుష్క సపోర్ట్ గా ఉంటూ వచ్చిందట.

అందుకే సినిమాతో ఎలాంటి సంబంధం లేకపోయినా సరే అనుష్కకి శాకుంతలం టీం థ్యాంక్స్ చెబుతుంది.

"""/"/ ఇక శాకుంతలం సినిమా విషయానికి వస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

గుణశేఖర్ ఇంకా దాన్ని చెక్కుతూనే ఉన్నారని తెలుస్తుంది.అయితే శాకుంతలం ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై సూపర్ బజ్ ఏర్పడగా సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఆడియెన్స్ ఆ సినిమా గురించి మర్చిపోయారు.

అంతేకాదు శాకుంతలం సినిమా రిలీజ్ విషయంలో కూడా మేకర్స్ క్లారిటీగా లేరని టాక్.

సమంత మాత్రం తన పోర్షన్ ని కంప్లీట్ చేసి వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటుంది.

శాకుంతలంతో పాటుగా యశోద అనే ఫీమేల్ సెంట్రిక్ సినిమా కూడా సమంత చేస్తుందని తెలిసిందే.

 హరి హరీష్ దర్శక ద్వయం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుంది.