నాగోబా జాతర విశిష్టత ఏమిటి? అది ఎవరి పండుగ?

నాగోబా జాతర కొంత మందికి తెలిసినప్పటికీ.చాలా మందికి తెలియదు.

ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతరల్లో నాగోబా జాతర ఒకటి.సర్ప జాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత.

ప్రతి ఏటా పుష్యమాస అవావాస్య రోజు ఈ జాతరను ప్రారంభించి నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు.

ఈ అమావాస్య రోజు గోండుల ఆరాధ్య దైవమైన నాగోబా.అంటే శేష నారాయణ మూర్తి పురివిప్పి నాట్యమాడతాని గిరిజనుల నమ్మకం.

అమావాస్య నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆది శేషువు కనిపిస్తాడని గోండుల నమ్మకం.

అంతే కాకుండా వారందరూ అందించే పాలను తాగి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు.ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా గోండుల దేవత.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర కేస్లాపూర్ గ్రామంలో ఉంద.

ఈ జాతర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది.నాలుగు రోజుల పాటు సాగే నాగోబా జాతరకు లక్షలాది మంది ఆది వాసీలు వస్తుంటారు.

పూర్వం మెస్రం వంశీయుల్లో ఏడుగురు అన్నదమ్ములు కేస్లాపూర్ లోని మేనమామ ఇంటికి వస్తారు.

కష్టాల్లో ఉన్నా సాయం చేయలేదనే కోపంతో తన తండ్రిని చంపడానికి వస్తున్నారని భఆవించిన కూతురు ఇంద్రాదేవి పెద్దపులిగా మారి ఏడుగురి అన్నదమ్ముల్లో ఆరుగురిని హతమారుస్తుంది.

చివరి వాడు నాగేంద్రుడిని వేడుకోవడంతో ప్రాణాలతో బయటపడి కేస్లాపూర్ చేరుకుంటాడు.తనని కాపాడిన నాగేంద్రుడిని తమ గ్రామంలోనే కొలువుతీరాలని కోరుగా.

అక్కడే దేవత వెలిసింది.ఆ దేవతే.

కేస్లాపూర్ నాగోబాగా ప్రసిద్ధి చెందింది.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..!