మెగాస్టార్ తో సినిమా చేస్తున్నానంటే చిన్న మామయ్య అలా రియాక్ట్ అయ్యారు: సుశాంత్

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) త్వరలోనే మెహర్ రమేష్( Mehar Ramesh ) దర్శకత్వంలో నటించిన భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్( Sushanth ) కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈయన కీర్తి సురేష్ జోడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.ఇక చిరంజీవికి జోడిగా తమన్నా నటించారు.

ఇలా ఈ సినిమాలో సుశాంత్ కూడా భాగం కావడంతో ఈయన కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

"""/" / ఇలా పలు ఇంటర్వ్యూలకు హాజరైనటువంటి సుశాంత్ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని అదృష్టం రావడం నిజంగా తన అదృష్టమని తెలిపారు.

అయితే మొదట్లో కాస్త భయం వేసిన చిరంజీవి గారు మాత్రం ప్రతి ఒక్క సెలబ్రిటీని సేఫ్ జోన్ లో ఉంచి ఎలాంటి కంగారు లేకుండా నటించే వాతావరణం కల్పిస్తారని సుశాంత్ తెలిపారు.

చిరంజీవి గారితో సినిమా అవకాశం వచ్చిందని తెలిసినప్పుడు మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారని ఈయనకు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురయింది.

"""/" / ఈ ప్రశ్నకు సుశాంత్ సమాధానం చెబుతూ నాకు మెగాస్టార్ చిరంజీవి గారితో నటించే అవకాశం వచ్చిందని ముందుగా నేను తన చిన్న మామయ్య నాగార్జున గారికి చెప్పాను ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారని ఈ సందర్భంగా సుశాంత్ భోళా శంకర్ సినిమాలో భాగం కావడం గురించి తెలియజేశారు.

ఇక ఈ సినిమాలో తనకు కీర్తి సురేష్( Keerthy Suresh ) , తమన్నా( Thamannah ) మధ్య వచ్చే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని ఈయన తెలియజేశారు.

ఇక చిరంజీవి గారితో కలిసి ఓ పాటలో డాన్స్ చేసే సమయంలో తాను చాలా కంగారు పడ్డానని,షూటింగ్ లొకేషన్లో కూడా భారీగా రిహార్సల్స్ చేశానని తెలిపారు.

కానీ చిరంజీవి గారు మాత్రం మైండ్ తో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ప్రశాంతంగా కూర్చున్నారంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కత్తిపోట్ల వల్ల సైఫ్ అలీ ఖాన్ కు అన్ని వేల కోట్ల రూపాయల నష్టమా.. ఏం జరిగిందంటే?