తెలుగు బిగ్‌బాస్ 3లో ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా?
TeluguStop.com
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 మరో రెండు వారాల్లో ప్రారంభం కాబోతుంది.అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.
ప్రస్తుతం పార్టిసిపెంట్స్‌తో ఒప్పందం కార్యక్రమాలు జరుగుతున్నాయి.వారి ఆరోగ్య పరిస్థితి మరియు మానసిక పరిస్థితిలను అంచనా వేసేందుకు ఒక టీం వారిని ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇక ఇప్పటికే ఈ షోకు హోస్ట్ నాగార్జున అంటూ క్లారిటీ వచ్చేసింది.నాగార్జునపై ప్రోమో కూడా కట్ చేయడం జరిగింది.
ఇక ఈ షో గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. """/"/
మొదటి రెండు సీజన్‌లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
నిర్వాహకులకు భారీ టీర్పీరేటింగ్ ద్వారా లాభాలు దక్కాయి.అయితే మొదటి రెండు సీజన్‌లకు ఉన్నంత క్రేజ్ ఈసారి లేదని చెప్పాలి.
ఎందుకంటే మొదటి రెండు సీజన్‌లు ఎన్టీఆర్ వల్ల ఆ తర్వాత వివాదాల వల్ల పేరు తెచ్చుకుని టీఆర్పీరేటింగ్‌ను దక్కించుకున్నాయి.
మరి మూడవ సీజన్‌కు సంబంధించిన వార్తలపై జనాలు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లుగా అనిపించలేదు.
అందుకే ప్రేక్షకుల దృష్టిని ఎలాగైనా ఆకర్షించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈసారి వినూత్న కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.
"""/"/
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో ప్రతి వారం ఒక గెస్ట్ రాబోతున్నాడు.
ఆ గెస్ట్‌తో తెగ సందడి చేయబోతున్నారు.గెస్ట్‌తో శనివారం లేదా ఆదివారం మొత్తం కూడా పార్టిసిపెంట్స్ మరియు హోస్ట్ సరదాగా గడపబోతున్నారు.
ఇలా వారంకు ఒక గెస్ట్ రానున్నారు.ఇక మద్య మద్యలో సినిమా ప్రమోషన్స్ కోసం సినీ తారలు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నారు.
ఇలా మొత్తంగా బిగ్‌బాస్ సీజన్ 3ని సెలబ్రెటీలతో ఫుల్ చేసి టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అయ్యేనో చూడాలి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?