ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి అయిన సందర్బంగా ప్రత్యేక కథనం..

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది.

ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో రెండు పథకాలు అమలు చేసి రికార్డు సృష్టించింది.

జిల్లా సమగ్రాభివృద్దికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది.రాజన్న భక్తులకు వేగంగా దర్శనం.

వసతి కల్పించేందుకు భారీగా నిధులు మంజూరు చేసింది.సిరిసిల్ల మర నేత కార్మికుల ముప్పై ఏండ్ల కల సాకారం చేసే పనులకు శ్రీకారం చుట్టింది.

నేత కార్మికులు స్వయం సమృద్ది సాదించేందుకు నిధులు మంజూరు చేసి, చేతి నిండా పనిని అందిస్తూ ఆదుకుంటున్నది.

రైతు రుణ మాఫీ, మహా లక్ష్మి పథకం కింద ఉచిత బస్సు, 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ కు ఇప్పటిదాకా దాదాపు రూ.

500 కోట్ల లబ్ది చేకూరింది.h3 Class=subheader-styleరూ.

381 కోట్ల రుణ మాఫీ./h3p రుణమాఫీ అంశాన్ని ప్రస్తుత ప్రజాప్రభుత్వం సుసాధ్యం చేసింది.

జిల్లాలో మూడు విడుతలలో 47 వేల 977 మంది రైతులకు 381 కోట్ల 46 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది.

రైతు భరోసా అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది.మహిళా మణులకు అభయహస్తం.

మహాలక్ష్మీ గ్యారెంటీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం సాకర్యం అమలు చేస్తున్నది.

జిల్లాలో ఇప్పటివరకు సుమారు 61 కోట్ల 60 లక్షల రూపాయల విలువ గల 1 కోటి 64 లక్షల 56 వేల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు.

మహిళలు ఉత్సాహ వంతంగా తమ విధి నిర్వహణకు, రాష్ట్రంలోని పుణ్య క్షేత్రాలు, పర్యాటక స్థలాలకు, బంధువులు, స్నేహితుల ఇండ్లకు ప్రయాణం చేస్తున్నారు.

500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది.మన జిల్లాలో ఇప్పటి వరకు 93 వేల 104 మంది కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 7 కోట్ల 35 లక్షల 39 వేల రూపాయల సబ్సిడీ సొమ్ము జమచేశాం.

రాష్ట్రంలోని పేదలకు, వెనుకబడిన వర్గాల ప్రజల గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది.

పథకం క్రింద మార్చి 1, 2024 నుంచి ఆగస్టు 10, 2024 వరకు 8 లక్షల 41 వేల 643 జీరో బిల్లులు జారీచేయడం జరిగింది.

ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు 37 కోట్ల 50 లక్షల రూపాయలను గృహజ్యోతి క్రింద చెల్లించడం జరిగింది.

మధ్య మానేరు నిర్వాసితులకు మేలు.సొంత ఇండ్లు ఉండాలనేది ప్రతి సామాన్యుడి జీవిత కల.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేసింది.

ఇండ్లులేని అర్హులైన పేదలందరికీ ఇంటి నిర్మాణం నిమిత్తం రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నాం.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3 వేల 500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది.

దాదాపు రూ.236 కోట్ల విలువైన 4,696 ఇందిరమ్మ ఇండ్లు మధ్య మానేరు నిర్వాసితులు, వేములవాడ నియోజకవర్గానికి మంజూరు చేశారు.

రాజన్న ఆలయ అభివృద్దికి శ్రీకారం.వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి భక్తులకు సులభంగా.

వేగంగా దర్శనం కల్పించేందుకు, వేములవాడ మూలవాగు మీదుగా రాజన్న ఆలయానికి చేరుకునేందుకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రూ.

127 కోట్ల నిధులు కేటాయించింది.దీంతో పెండింగ్ పనుల్లో వేగం పెరిగి త్వరలో పట్టణ వాసులు, భక్తులకు అందుబాటులోకి రానుంది.

ట్రాఫిక్ సమస్య దూరం కానుంది.శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రీతి పాత్రమైన మొక్కు అయిన కోడెలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటి ఇబ్బందులు దూరం చేస్తున్నది.

వాటికి నిలువ నీడ కల్పించేందుకు షెడ్లు దాదాపు రూ.66 లక్షలతో నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చాం.

రూ.43 లక్షలతో సీసీ ఫ్లోరింగ్, రూ.

18 లక్షలతో డ్రైనేజీ, జాతర గ్రౌండ్ వద్ద ఉన్న గోశాలలో రూ.50 లక్షలతో షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశాం.

రూ.35 కోట్ల అంచనాలతో అన్నదాన సత్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు.

నెరవేరిన నేతన్నల మూడు దశాబ్దాల కల.సిరిసిల్లలోని నేతన్నలకు భరోసా కల్పించే చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది.

సమగ్ర శిక్ష కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం క్లాత్ ఉత్పత్తి చేసే ఆర్డర్లను సిరిసిల్లలోని వస్ర పరిశ్రమకు అందజేసింది.

జిల్లాలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుట్టించి విద్యార్థులకు రెండు యూనిఫాంల చొప్పున పంపిణీ చేసింది.

దాదాపు రూ.28 కోట్ల 84 లక్షల విలువైన క్లాత్ ఆర్డర్లను సిరిసిల్ల నేత పరిశ్రమకు అందజేసింది.

బతుకమ్మ చీరలు, ఇతర ఆర్డర్ల బకాయిలు రూపాయలు 379 కోట్లు సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు చెల్లించడం జరిగింది.

అలాగే 66 లక్షల మీటర్ల ఆర్వీఎం క్లాత్ ఆర్డర్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

సిరిసిల్ల నేత కార్మికుల మూడు దశాబ్దాల కల నెరవేరనుంది.రూ.

50 కోట్లతో వేములవాడలో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేసింది.90 శాతం క్రెడిట్ ఫై నేత కార్మికులకు యార్న్ అందజేసి, టేస్కో ఆధ్యర్యంలో సరుకు సేకరించనున్నారు.

త్వరలో హైదరాబాదులోని హోల్ సేల్ క్లాత్ డీలర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు.

11,698 మంది కార్మికులకు త్రిఫ్ట్ కింద రూ.36 కోట్లు, నేతన్నకు 43 మంది రూ.

5 లక్షల చొప్పున పంపిణి చేశారు.యారన్ సబ్సిడీ కింద రూ.

37 కోట్లు చెల్లించారు.h3 Class=subheader-style455 మందికి ప్రమోషన్లు.

260 మందికి కొలువులు/h3p ప్రజా ప్రభుత్వం సర్కార్ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఖాళీగా పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది.

ఐటీఐలను అడ్వాన్స్డ్ సెంటర్లుగా అభివృద్ది చేస్తున్నది.జిల్లాలోని 510 ప్రభుత్వ పాఠశాలల్లో 45 వేల 97 మంది విద్యార్థులు చదువుతున్నారు.

7 మోడల్ పాఠశాలలు, 13 కస్తుర్భాగాంధీ విద్యాలయాలు, ఒక అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గాను ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కింద 283 పాఠశాలలను ఎంపిక చేసి త్రాగు నీరు, మేజర్, మైనర్ రిపేర్స్, టాయిలెట్ల మరమ్మతులు చేయించడం జరిగింది.

ప్రొఫెసర్ జయ శంకర్ బడిబాట కింద ఈ ఏడాది 4 వేల 384 మంది విద్యార్థులు చేరడం జరిగింది.

అలాగే దాదాపు 136 మంది స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, బాషా పండితులు, పీఈటీల పోస్ట్ లు భర్తీ చేసి, నియామక పత్రాలు అందజేశారు.

అలాగే 455 మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించారు.124 మందిని గ్రూప్ -4 కింద ఉద్యోగాలు సాదించారు.

H3 Class=subheader-styleసాగుకు ఊపిరి పెండింగ్ సాగు నీటి ప్రాజెక్ట్ ల ప్రత్యేక దృష్టి.

/h3p జిల్లాలోని పెండింగ్ సాగు నీటి ప్రాజెక్ట్ ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని ప్రకటించింది.కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 9 రూ.

1 వేయి 180 కోట్లతో ఇప్పటి దాకా 81 శాతం పూర్తి చేశారు.

మిగితా పని పూర్తి చేసేందుకు రూ.340 కోట్లు కేటాయించారు.

ఈ పనులు పూర్తి అయితే సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండల్లాలోని 56 వేల ఎకరాలకు, వేములవాడ నియోజక వర్గంలోని కోనరావుపేట మండలంలోని 30 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 10.కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 10 పనులు రూ.

2400 కోట్లతో 90 శాతం పూర్తి చేశారు.మిగితా పనులు పూర్తి చేసేందుకు రూ.

134 కోట్లు కేటాయించారు.మానకొండూర్ నియోజక వర్గంలోని ఇల్లంతకుంట మండలానికి 15 వేల ఎకరాలు సాగులోకి రానుంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 11 పనులు రూ.2 వేల400 కోట్లతో 75 శాతం పూర్తి చేశారు.

మరో రూ.152 కోట్లతో పనులు పూర్తి చేయనుండగా, సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల, తంగళ్ళపల్లి మండలంలోని 32 వేల ఎకరాలు నూతనంగా, 22 వేల ఎకరాల, 10 వేల ఎకరాలు బోయినపల్లి మండలంలో ఆయకట్టు స్థిరీకరణ చేయనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 12.కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 12 పనులు రూ.

3వేల200 కోట్లతో 94 శాతం పూర్తి చేశారు.మరో రూ.

50 కోట్లతో పనులు పూర్తి చేయనుండగా, సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట, ముస్తాబాద్ మండల్లాలో 22 వేల ఎకరాలు నూతనంగా సాగులోకి రానుంది.

100 శాతం సర్వే పూర్తి.భవిష్యత్తు ప్రణాళికల రచన.

ఏ వర్గం ప్రజలు ఎందరు ఉన్నారు? వారి స్థితిగతులు తెలుసుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)కు శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1531 ఎన్యుమరేషన్ బ్లాక్ ల పరిధిలో 1,92,432 ఇండ్లు సర్వే పూర్తి చేశారు.

ఆన్లైన్ లో డేటా ఎంట్రీ కూడా యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.h3 Class=subheader-styleప్రజా పాలన కేంద్రాలు :/h3p రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి ప్రజాపాలనలో భాగంగా హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రతి మంగళ, శుక్రవారం ప్రజల నుంచి రాష్ట్ర మంత్రులు అర్జీలు స్వీకరిస్తున్నారు.

అలాగే మన జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్, ఆయా శాఖల అధికారులు హాజరై విజ్ఞప్తులు తీసుకుంటున్నారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక సేవా కేంద్రం ఏర్పాటు చేసి, రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరిస్తున్నాము.

H3 Class=subheader-style400 మందికి కాటమయ్య రక్షా సేఫ్టీ కిట్లు/h3p కల్లు గీత కార్మికులు చెట్టు నుంచి పడి ప్రమాదాల బారిన పడకుండా ఐఐటీ హైదరాబాద్ అభివృద్ది చేసిన కాటమయ్య రక్షా సేఫ్టీ కిట్ కార్మికులందరికి ఉచితంగా అందజేస్తున్నారు.

జిల్లాలో ఇప్పటికే 400 మందికి కిట్లు పంపిణి చేశారు.h3 Class=subheader-styleమత్స్య శాఖ:/h3p 2024-25 సంవత్సరానికి గానూ జిల్లాలోని వివిధ మత్య్స పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని 440 చెరువుల్లో 70.

58 లక్షల చేప పిల్లలను 100 శాతం సబ్సిడీపై లక్ష్యానికి గాను 49.

46 లక్షల పిల్లలను నీటిలో విడుదల చేశారు.h3 Class=subheader-styleపంచాయతీ రాజ్ రోడ్లకు రూ.

18 కోట్లు./h3p జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖకు పలు రోడ్స్ నిర్మాణానికి రూ.

18 కోట్ల సీసీఆర్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.రహదారుల సమస్యలకు పరిష్కారం దొరికింది.

వేములవాడ నియోజకవర్గంలోని మారుపాకలో రూ.35 లక్షలు, కోనరావుపేటలో రూ.

1.65 కోట్లు, కొలనూర్ నుంచి రామన్నపేట దాకా రోడ్ & బ్రిడ్జి నిర్మాణానికి రూ.

1.90 కోట్లు, సుద్దాల క్రాస్ రోడ్ నుంచి మంగళ్ళపల్లికి బీటీ రోడ్ నిర్మాణానికి రూ.

1.30కోట్లు, మల్కపేటలో సీసీ రోడ్ నిర్మాణానికి రూ.

90 లక్షలు, చందుర్తి మండలం సనుగులలో రోడ్ నిర్మాణానికి రూ.కోటి, మూడపల్లిలో నిర్మాణానికి రూ.

90 లక్షలు, రుద్రంగి నుంచి కొచ్చగుట్ట తండా( అంబేద్కర్ స్టేటస్ నుంచి ఇందిరాచౌక్ వయా హనుమాన్ టెంపుల్) దాకా రూ.

1.50 కోట్లు, రుద్రంగి నుంచి రామకిష్టాపూర్ దాకా రోడ్ నిర్మాణానికి రూ.

62 లక్షలు, గంభీరావుపేట మండలం గోరంటాల నుంచి రత్నగిరిపల్లి దాకా నిర్మాణానికి రూ.

65 లక్షలు, తంగళ్ళపల్లి మండలంలో పద్మనగర్ నుంచి మండేపల్లి నాగుల ఎల్లమ్మ ఆలయం దాకా రూ.

2.25 కోట్లు, ఆర్ అండ్ రోడ్ నుంచి వృద్దుల ఆశ్రమం దాకా రూ.

60 లక్షలు, వీర్నపల్లి మండలం మద్దిమల్లి నుంచి లోద్ది వయా కాశి తండా దాకా రోడ్ నిర్మాణానికి రూ.

1.14 కోట్లు, తంగళ్ళపల్లి మండలంలో ఇందిరానగర్ అంకుషాపూర్ దాకా రూ.

36 లక్షలు, బోయినపల్లి మండలం రామన్నపేట్ నుంచి లక్ష్మిపూర్ దాకా రూ.3 కోట్లు మంజూరు చేసింది.

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్, ఒంటరి మహిళలకు ఉపాధి కల్పించేందుకు.రూ.

5 కోట్ల వ్యయంతో పెట్రోల్ బంక్ ఏర్పాటు 24 మందికి ఉద్యోగాలు ఆర్ధిక పునరావాసం కింద దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్, ఒంటరి మహిళలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాలతో రూ.

2.50 కోట్ల విలువైన భూమి రాజన్న సిరిసిల్ల అధికార యంత్రాంగం కేటాయించింది.

రూ.2.

50 కోట్ల తో ఐఓసీఎల్ యాజమాన్యం మంజూరు చేసి బంక్ నిర్మాణాన్ని సిరిసిల్లలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట పూర్తి చేసింది.

పెట్రోల్, డీజిల్ సరుకు కొనుగోలుకు రూ.20 లక్షలు జిల్లా అధికార యంత్రాoగం గ్యారంటీగా కేటాయించింది.

పెట్రోల్ బంక్ సమీపంలోని దాదాపు 24 మంది దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్, ఒంటరి మహిళలకు ఉపాధి దొరుకుతుంది.

బంక్ ను ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్, మానకొండూర్, చొప్పదండి శాసన సభ్యులు సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ కలిసి ప్రారంబించారు.

H3 Class=subheader-styleఇందిరా మహిళా శక్తి./h3p ఆడబిడ్డలను కోటీశ్వరులు గా చేయడమే లక్ష్యంగా మహిళలను మహారాణులను చేయడం కోసం “ఇందిరా మహిళా శక్తి” పేరుతో పథకానికి ప్రజా పభుత్వం శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలోని మహిళా సంఘాలలో ఉన్న 63 లక్షల మందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా రూపొందించి, వచ్చే 5 సంవత్సరాల కాలంలో దాదాపు లక్ష కోట్ల రుణాలు అందేలా చర్యలు తీసుకుంటుంది.

మహిళా సంఘాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం స్కూల్ యూనిఫారం కుట్టు కూలీని 50 నుంచి 75 రూపాయలకు పెంచింది.

ఇప్పటిదాకా మూడు ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు ప్రారంభించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం, ఇల్లంతకుంట, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రూ.

3 లక్షల బ్యాంక్ రుణం అందజేసి పథకానికి శ్రీకారం చుట్టారు.మహిళా సంఘాలతో 12 రకాల వివిధ వ్యాపార, వాణిజ్య యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము.

ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో 7 వేల 959 స్వశక్తి సంఘాలకు 533 కోట్ల 83 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 2 వేయి 729 సంఘాలకు రూ.

346 కోట్ల బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగింది.స్త్రీనిధి ద్వారా 2024-25 సంవత్సరంనకు రూ.

58 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.24 కోట్ల 50 లక్షల బ్యాంక్ రుణాలు మంజూరు చేయడం జరిగింది.

మహిళా శక్తి లో భాగంగా ఎంటర్ పైజేస్ ద్వారా 5123 యూనిట్లు లక్ష్యం కాగా 3351 యూనిట్లు, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ లో 600 యూనిట్లు లక్ష్యం కాగా 366 యూనిట్లు, పౌల్ట్రీ మథర్ యూనిట్ లో 12 యూనిట్లు లక్ష్యం కాగా 12 యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ లో 120 యూనిట్లు లక్ష్యం కాగా 25 యూనిట్లు, మిల్క్ పార్లర్ లో 1 యూనిట్లు లక్ష్యం కాగా 2 యూనిట్లు, క్యాంటిన్ లో 4 యూనిట్లు లక్ష్యం కాగా 3 యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది.

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మన జిల్లాలో 96 వేల జాబ్ కార్డులను జారీ చేసి ఉపాధి కల్పించడం జరిగింది.

H3 Class=subheader-styleరూ.83 కోట్ల పత్తి కొనుగోలు/h3p జిల్లాలో సీసీఐ ఆద్వర్యంలో మొత్తం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది.

మొత్తం 5,792 మంది రైతుల నుంచి 1,11,215 క్వింటాల్ల పత్తిని కొనుగోలు చేసి, రూ.

83 కోట్లను చెల్లించింది.h3 Class=subheader-styleరూ.

414 కోట్ల విలువైన ధాన్యం సేకరణ./h3p 248 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు.

ఇప్పటిదాకా 33,691 మంది రైతుల నుంచి 1,98,000 టన్నుల దొడ్డు, సన్న రకం ధాన్యం సేకరించారు.

5,500 టన్నుల సన్న రకం ధాన్యం సేకరించి క్వింటాలుకు రూ.500 బోనస్ కింద మొత్తం రూ.

27.88 లక్షలు చెల్లించారు.

ఇది కలా…నిజమా వైరల్ అవుతున్న నటి శోభిత పోస్ట్…. ఏమైందంటే?