పశ్చిమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ – సుజనా
TeluguStop.com
నియోజకవర్గం రూపురేఖలను మారుస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు.
రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని జోస్యం చెప్పారు.వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని, అన్ని వర్గాలకూ జగన్ అన్యాయం చేశారని సుజనా దుయ్యబట్టారు.
47వ డివిజన్ లోని కలరా హాస్పిటల్, కేటీ రోడ్, అచ్చమ్మ వీధి, అల్లినగర్ కుండల బజార్, కేఎల్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
పశ్చిమ నియోజకవర్గం లో అనేక సమస్యలు ఉన్నాయని, రోడ్లు డ్రైనేజీ నిర్మాణం, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలతోపాటు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యా వైద్యం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని, తను మాటలు మనిషిని కాదని చేతల్లో చేసి చూపిస్తానన్నారు.
కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకారం అందించానని గుర్తు చేశారు.విజయవాడ సమగ్రాభివృద్ధికి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నామని తెలిపారు.
విజయవాడలో పుట్టి పెరిగిన తనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసన్నారు.ఎమ్మెల్యేగా సేవ చేసుకునే అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని ప్రతి సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందేలా కార్యాచరణ ఉంటుందన్నారు.
యువతకు సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నత విద్య ఉపాధి అందించేందుకు అవసరమైన వనరులు సమీకరణ చేస్తానని తెలిపారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిందేమీ లేదని టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా విమర్శించారు.
నియోజకవర్గం లొని ప్రాంతాల పేర్లే తెలియవని పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదని అన్నారు.
సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకరించారని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, ఎన్డీయే కూటమిని గెలిపించాలని నాగుల్ మీరా విజ్ఞప్తి చేశారు.
సుజనాకు 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు 46 డివిజన్ మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ డివిజన్ అధ్యక్షుడు డీటీ ప్రభుదాస్ ఘన స్వాగతం పలికారు.
స్థానిక ప్రజలు సుజనాకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సీనియర్ నాయకులు పైలా సోమి నాయుడు, కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 5, మంగళవారం2024