పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై స్పీకర్ ఓం బిర్లా ప్రకటన

పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటన చేశారు.

భవిష్యత్ లో ఇటువంటి తరహా ఘటనలు జరగకుండా సభ్యులు ఇచ్చిన సూచనలను అమలు చేస్తామని తెలిపారు.

భదత్రా వైఫల్య ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే పార్లమెంట్ లో చోటు చేసుకున్న ఈ ఘటనను రాజకీయం చేయడం తగదని చెప్పారు.

సభా మర్యాదలతో పాటు గౌరవాన్ని అందరూ పాటించాలని తెలిపారు.అయితే ఇటీవల లోక్ సభలోకి చొచ్చుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు టియర్ గ్యాస్ ప్రయోగించిన విషయం తెలిసిందే.

లోక్ సభలో సమావేశాలు జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో సభలోని సభ్యులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.

వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

బయట రూ.100, 200లకు చెప్పులు, బూట్లు కొంటున్నారా? అవి ఎక్కడి నుంచి వస్తాయంటే?