అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వ్యోమగామి: మే లో ప్రయోగం.. స్పేస్ ఎక్స్ కీలక అడుగులు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వ్యోమగాములను తీసుకెళ్లాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న స్పేస్ ఎక్స్ కంపెనీ ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.

వచ్చే మేలో తొలిసారిగా వ్యోమగామిని ఖగోళంలో అడుగు పెట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎలన్ మాస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌ సంస్థ మొదటిసారిగా మనిషిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తెలిపింది.

టెక్ వ్యవస్థాపక సంస్థ నాసా వ్యోమగాములు బాబ్ బెహె‌న్‌కెన్, డౌగ్ హర్లీలను అంతరిక్షంలోకి పంపేందుకు ఫాల్కన్ 9 రాకెట్‌ను ప్రయోగించేందుకు స్పేస్ ఎక్స్ ప్రయోగాలు చేస్తోంది.

దీనికి నాసా అనుమతి పొందేందకు గాను క్యాప్సూల్స్‌ను ఎన్నో రకాలుగా పరీక్షించింది.ఈ నెల ప్రారంభంలో కాలిఫోర్నియా నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి డ్రాగన్ క్యూప్సూల్‌తో పాటుగా పరీక్ష నమూనాలు, 90 కిలోల సరకులను పంపించారు.

ఈ వాహనం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రానికి ముందు వైపు నుంచి వెళుతుంది.

అంతర్గతంగా ఉన్న కంప్యూటర్లు, సెన్సర్ల సాయంతో తన దిశను నిర్దేశించుకుంటూ అనుసంధానమవుతుంది.డమ్మీ వ్యోగగాములతో ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్ చుట్టూ ఇది ఒక రౌండ్ ట్రిప్ పూర్తి చేసింది.

ఆరు రోజుల అంతరిక్షంలో సంచరించి తిరిగి భూమి మీదకు సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.

"""/"/ ఇప్పటి వరకు అంతరిక్ష కేంద్రానికి పంపుతున్న సరకు నౌకలను స్పేస్ స్టేషన్‌కు అనుసంధానించి ఉన్న రోబో హస్తం సాయంతో పట్టుకుని లాగుతూ అనుసంధానం చేయాల్సి వస్తోంది.

సరకు రవాణా చేసే ఆ అంతరిక్ష నౌకలకు తమకు తాముగా అనుసంధానమయ్యే సాంకేతిక పరిజ్ఞానం లేదు.

అందువల్ల స్పేస్ ఎక్స్ ప్రయోగంపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోది.కాగా అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని పంపించే కాంట్రాక్టు ఇవ్వాలని నాసా భావిస్తోంది.

అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని రవాణా చేయడానికి సంబంధించి బోయింగ్ సంస్థతో కూడా నాసా పనిచేస్తోంది.

బోయింగ్ సొంతంగా స్టార్ లైనర్ అనే క్యాప్స్యూల్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే.

పెందుర్తి వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!