వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

సూర్యాపేట జిల్లా:అధిక వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు,రైతులు, వాహనదారులు,ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని,ప్రమాదాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.

ఈ మేరుకు శనివారం సూర్యాపేట జిల్లా పోలీసు అధికారులను,సిబ్బందిని అప్రమత్తం చేశామని ఒక ప్రకటనలో తెలిపారు.

అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి సేవలు అందించాలని సిబ్బందిని అదేశించారు.ఏదైనా అత్యవసరమైతే స్థానిక పోలీసులకు,డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు సేవలను పొందవచ్చని తెలిపారు.

నీటి ప్రవాహం వద్దకు సెల్ఫీ ఫొటోస్ కోసం వెళ్ళవద్దు,ప్రమాదాల బారిన పడొద్దని సూచించారు.

అధిక వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెల్లడించారు.శిథిలావస్థకు వచ్చిన నివాసలలో ఉండవద్దు.

చేపల వేటకు వెల్లవద్దు.చెరువులు,వాగులు వద్దకు వెళ్ళవద్దు.

వాతావరణం తడిగా ఉన్నందున కరెంట్ స్థంబాల వద్దకు వెళ్ళవద్దు.సాధారణ ప్రజలు కరెంట్ రిపేర్ పనులు చేయవద్దు.

యువకులు సరదాకోసం వాగులు,చెరువులు,బావులు, నదులు,లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దు.వర్షం తీవ్రత ఉన్నందున పిల్లలు,వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రయాణ సమయంలో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి,రోడ్లపై వర్షం నీరు చేరడం వల్ల వాహనాలు అదుపుతప్పి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.

వాహనాలు వేగంగా నడపవద్దు.వర్షం పడే సమయంలో ప్రయాణాలు చేయకుండా వీలైతే వాయిదా వేసుకోవాలి.

ఈ జాతీయ రహదారి (NH65)పై వాహనదారులు నెమ్మదిగా వెళ్ళాలి.వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తగా ఉండాలి.

పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు.

వామ్మో.. ఏంటి భయ్యా.. ఆ ఇంట్లో పాములు కలిసి ఏమైనా పుట్ట పెట్టాయా ఏంటి..?