వినాయక నిమజ్జనంలో ఎస్పి, డి.ఎస్.పి డాన్సులు..

తాడిపత్రి మండలం బోడాయిపల్లి గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జనంలో ఎస్పి పకీరప్ప డి.

ఎస్.పి చైతన్య డాన్సులు వేయడం తో గ్రామస్తుల్లో సంతోషానికి అవధుల్లెకుండా పోయాయి.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ పకీరప్ప తాడిపత్రి డిఎస్పి చైతన్య రూరల్ అప్గ్రేడ్ సీఐ చిన్న పెద్దయ్య లు వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామస్తులతో కలిసి నృత్యం చేశారు.

తాడిపత్రి లోని చాలా గ్రామాలలో వినాయక నిమజ్జనం నిర్వహించారు.బోడాయిపల్లి గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జనానికి జిల్లా ఎస్పీ పకీరప్ప తాడిపత్రి డియస్పి చైతన్యలు హాజరై గ్రామస్తులతో కలిసి నృత్యం చేయడం, ఫ్యాక్షన్ గ్రామంలో గ్రామస్తులను ఏకం చేయించి చిందులెయించారు.

వినాయక ఊరేగింపులో పాల్గొని డప్పుల వాయిద్యానికి అనుగుణంగా ఎగరడం తో గ్రామస్తుల్లో సంతోషానికి అవధులలేకుండా పోయాయి.

డ్రింక్ డ్రైవ్ లిమిట్ తగ్గించనున్న యూకే.. ఎందుకో తెలిస్తే..?