SP Balu Daughter Pallavi: ఈ హిట్ సాంగ్స్ ఎస్పీ బాలు కూతురు పల్లవి పాడిందని మీకు తెలుసా ?
TeluguStop.com
ఎస్పీ బాలసుబ్రమణ్యం.( SP Balasubramanyam ) సింగర్ గా, సంగీత దర్శకుడిగా, నటుడిగా అన్ని రంగాల్లో తనను తాను నిరూపించుకొని ఆయనకు మించిన గొప్ప గాయకుడు మరొకరు లేరు అనే విధంగా సౌత్ ఇండియా లో స్థానం సంపాదించుకున్నారు.
బాలు ఒక్కరు మాత్రమే కాదు అయన ఇంట్లో అయన చెల్లి శైలజ, కుమారుడు చరణ్ కూడా గాయకులుగానే ఉన్నారు.
వీరి గురించి వీరు పాడిన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సినిమా పరిశ్రమలో వీరికి మంచి పాటలు పాడే అవకాశం వచ్చింది.అలా వీరు నేటికీ కూడా మంచి గాయకులుగా ఉన్నారు.
కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే బాలు కుమార్తె పల్లవి( Pallavi ) కూడా పాటలు పాడుతుంది అనే విషయం.
"""/" /
బాలు కి పాట అంటే ప్రాణం.ఎంత ఇష్టం అంటే ఒక పాటలో పల్లవి మరియు చరణం ఉంటుంది కాబట్టి తన పిల్లలకు కూడా పల్లవి మరియు చరణ్ అనే పేర్లు పెట్టుకున్నారు.
పేరుకు తగ్గట్టుగానే ఇద్దరు కూడా గాయకులే.( Singers ) అయితే పల్లవి మాత్రం చాల లోప్రోఫైల్ మైంటైన్ చేస్తుంది.
ఎక్కడ స్టేజెస్ పైన పాటలు పాడటం కానీ, ఇంటర్వూస్ ఇవ్వడం కానీ చేయదు.
అందుకే ఆమె గురించి చాల తక్కువ మందికి తెలుసు.తన కుమార్తె కాబట్టి పల్లవి ని ఎవరు గౌరవించద్దు అని ఆమె లో ఒక మంచి గాయని ఉందని, ఆమెను ఒక గాయకురాలుగానే చూడాలని ఒక సందర్భం లో బాలు చెప్పారు.
ఇక పల్లవి సైతం ఎదో మొక్కుబడిగా పాటలు పాడలేదు.ఆమె చాల మంచి మరియు హిట్ పాటలు పాడటం విశేషం.
"""/" /
ఐశ్వర్య రాయి నటించిన జీన్స్ సినిమాలో( Jeans Movie ) హాయిర హాయిర హాయిరబ్బా అనే పాట పల్లవి పాడిందే.
ఇక ప్రేమికుడు( Premikudu Movie ) సినిమాలో అందమైన ప్రేమారాణి లేత బుగ్గపై అనే పాట కూడా పల్లవి పాడిందే కావడం విశేషం.
ఇవి మాత్రమే కాకుండా ఒక డజన్ పాటల వరకు ఆమె పాడారు.కానీ ఎక్కడ కూడా ఆమె తన గురించి కానీ తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి కానీ చెప్పడం జరగదు.
అలాగే తండ్రి పేరు చెప్పుకొని సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇవ్వాలని కూడా ఎవరిని అడిగింది లేదు.
సంస్కారానికి మారు పేరు పల్లవి అనే విధంగానే నడుచుకుంటుంది.
హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. బాక్సాఫీస్ షేక్ కానుందా?