Yaddanapudi Sulochana Rani SP Balu : యద్దనపూడి సులోచనరాణి హీరోయిన్ గా ఎస్పీ బాలు హీరో గా చేయాల్సిన సినిమా ఎందుకు జరగలేదు ?
TeluguStop.com
టైటిల్ చూసాక చాలామందికి ఇదేంటి ? ఇలాంటి ఒక కాంబినేషన్ జరిగే అవకాశం ఉందా అనే అనుమానం రావచ్చు.
కానీ దీనికి సంబంధించిన చర్చలు జరిగాయి.ఎస్పీ బాలసుబ్రమణ్యం( SP Balasubrahmanyam ) తన మధురమైన గొంతుతో వేల పాటలు పాడి ఎంతోమందికి మధురానుభూతులు అందించిన ఒక గాయకుడు.
ఇక యుద్దనపూడి సులోచన రాణి( Yaddanapudi Sulochana Rani ) ఎంతోమంది పాఠకులను సంపాదించుకున్న ఒక రచయిత్రి.
వీరిద్దరూ వారివారి రంగాలలో నిష్ణాతులు.వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించడం ఏంటి ? అది కూడా హీరో హీరోయిన్స్ గా నటించడం అంటే ఊహించడానికి కష్టంగా ఉంటుంది.
పైగా ఈ ఆలోచన చేసింది సదాసీదా వ్యక్తి కాదు దర్శకుడు బాపు.( Director Bapu ) """/" /
వీరిద్దరితో కలిసి చేయాలనుకున్న సినిమా బంగారు పిచుక.
( Bangaru Pichuka Movie ) ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా యద్దనపూడి సులోచన రాణి అలాగే గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఉండాలని అనుకున్నారు బాపు అప్పుడే సాక్షి చిత్రంతో దర్శకుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అయితే తన రెండవ సినిమాని ఇలా భిన్నంగా ప్లాన్ చేసుకున్నారు.కొత్తవారితో చేయాలనే ఉద్దేశం ఉంది అందుకే ఎవరైనా హీరో మరియు హీరోయిన్ లక్షణాలు లేని నటీనటులతో చేయాలనుకున్నారు.
అందుకే హీరోయిన్ గా ఎలాంటి లక్షణాలు లేనటువంటి యుద్దనపూడి సులోచన రాణి బాపుగారు సంప్రదించారు.
అయితే ఆమె ఈ సినిమాలో నటించేది లేదు అంటూ తిరస్కరించారట.తనకు నటించే ఉద్దేశం లేదు అని, నటన కూడా ఎలా ఉంటుందో అస్సలు తెలియదని, తనకు రచయిత్రిగా ఉండటమే ఇష్టం అని తెలిపారట.
"""/" /
ఇక ఇదే విషయాన్ని బాలసుబ్రమణ్యం తో కూడా డిస్కస్ చేశారట బాపు.
అప్పుడప్పుడే సింగర్ గా బాలసుబ్రమణ్యం ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు.అంతకన్నా ముందు మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే ఒక చిత్రంలో పాట పాడుతున్న సన్నివేశంలో కూడా బాలు నటించారు.
దాంతో తన హీరో వేషానికి బాలు చక్కగా సరిపోతాడని అనుకున్నాడు బాపు.అయితే బాలుకు కూడా విషయం చెప్పడంతో ఆయన కూడా హీరోగా నటించడానికి సిద్ధంగా లేనని చెప్పారట.
దాంతో వీరిద్దరి కాంబినేషన్ మిస్ అయిపోయింది.ఈ సినిమాను విజయనిర్మల( Vijayanirmala ) చంద్రమోహన్ లతో( Chandramohan ) బాపు తెరకెక్కించారు.
మరోసారి ఇదే సినిమాను 1994లో దివ్యవాణి, నరేష్ పెళ్లి పుస్తకం పేరుతో బాపు తీశారు కానీ ఈ రెండు సినిమాలు పెద్దగా విజయాన్ని సాధించలేదు.
రూటు మార్చిన నాని వర్కౌట్ అవుతుందా..?