Balasubrahmanyam : ఏఐతో బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఇమిటేట్ చేస్తూ సాంగ్స్.. ఇది ఎంత వరకు కరెక్ట్..?

కృత్రిమ మేధస్సుతో ఇప్పుడు ఎవరి గొంతు నైనా ఇమిటేట్ చేసే టూల్స్ వచ్చాయి.

వీటిని చాలామంది రకరకాల పనులకు వాడుకుంటున్నారు.మోదీ నుంచి అందరి వాయిస్‌లను వివిధ పాటలు పాడేందుకు ఉపయోగిస్తున్నారు.

గతేడాదిలో రిలీజ్ అయిన "కీడా కోలా" సినిమాలో( Keeda Kola) కూడా కృత్రిమ మేధస్సుతో దివంగత నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం( Balasubrahmanyam ) వాయిస్‌ని ఒక పాటకు వాడుకున్నారు.

ఏఐతో అచ్చం బాలసుబ్రహ్మణ్యం లాంటి గొంతును సృష్టించి పాట పాడించారు.అయితే ఈ పాట గురించి తెలిసిన తర్వాత ఎస్పీ చరణ్( SP Charan ) కీడా కోలా మేకర్స్‌కు నోటీసులు పంపించాడు.

అయితే తన తండ్రి వాయిస్‌ను ఇలా వాడుకోవడంలో తప్పులేదు అనకుండా, తన అనుమతి తీసుకోకుండా వాడేసారు అని ఆయన ఫైర్ అయ్యాడు.

దాంతో చాలామంది అవాక్కయ్యారు. """/" / బాల సుబ్రహ్మణ్యం గాత్రం చాలా మధురమైనది.

ఆయన ఏ హీరోకి ఎలా పాడాలో అలానే పాడగల నైపుణ్యం ఉన్న వ్యక్తి.

కామెడీ, రొమాంటిక్, బాధాకరమైన పాటలలో ఆయన తన వాయిస్ అద్భుతంగా మార్చేసి బ్రహ్మాండంగా పాడతాడు.

ఆయన గొంతును కాపీ చేసి ఎవరికీ నచ్చినట్లు వారు పాటలు పాడించుకుంటూ వెళ్తే అది అవమానించినట్లే అవుతుంది.

డూప్లికేట్ చేసేసి బాలు లెగసీని, ప్రతిష్టను దెబ్బతీసినట్లే అవుతుంది.బాలు అంటే ఎన్నో మధురమైన పాటలే మనకి గుర్తొస్తాయి.

అలానే ఆయన టాలెంటు వైవిద్య భరితమైన వాయిస్ మన మనసులో మెదులుతుంది.కానీ ఏఐతో( AI ) ఆయన వాయిస్ వాడుకుంటూ వెళ్తే చివరికి నేటి తరం ప్రేక్షకులకు బాలు వాయిస్ ఎలా ఉంటుందో కూడా మర్చిపోతారు.

ఆయన గాత్రం ప్రజల్లో ఒక పేరడీగా మారిపోయే అవకాశం ఉంది. """/" / అందుకే బాలు లాంటి గొప్ప గాత్రాన్ని ఎవరూ కూడా ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించకూడదు.

చరణ్ మాత్రం వాడుకోవచ్చు కానీ తన అనుమతి లేకుండా వాడుకోవడం తప్పు అని అంటున్నాడు.

పర్మిషన్ కోసం మాత్రమే అతడు అభ్యంతరం తెలుపుతున్నాడు.ఇప్పుడు ఇది చాలామంది బాలు అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది.

నిజానికి ఆర్టిఫిషియల్ వాయిస్ లను ప్రేక్షకులు వినడానికి అసలు ఇష్టపడరు.ఎప్పటికైనా ఒరిజినల్ యాక్టర్లు, ఒరిజినల్ వాయిస్‌లు మాత్రమే ప్రజలకు నచ్చుతాయి.

అయినా ఆర్టిస్టుల పనులను కూడా ఏఐకే అప్పజెప్పవచ్చు.డబ్బులు మిగిల్చుకోవడానికి ఇలా చేయవచ్చు, లేదంటే దివంగత దిగ్గజాల స్వరాల కోసం వీటిని ఉపయోగించవచ్చు.

కానీ వీటిపై పరిమితులను కచ్చితంగా ఉంచాలి.లేకపోతే అందరికీ నష్టమే జరుగుతుంది.

ప్రభాస్ విషయం లో నా అమాయకత్వం తో మీడియా ఆడుకుంది : నిత్య మీనన్