బాలు గారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి

గత రెండు వారాలుగా కరోనాతో బాదపడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం విషయంలో ఒక నాలుగు రోజులు చాలా ఆందోళన వ్యక్తం అయ్యింది.

బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ మాట్లాడుతు నాన్న ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని చెప్పడంతో చాలా మందిలో ఆందోళన వ్యక్తం అయ్యింది.

ఆయన నాలుగు రోజుల పాటు శ్వాస తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డట్లుగా హెల్త్‌ బులిటెన్‌ లో పేర్కొన్నారు.

అయితే ఇప్పుడు పరిస్థితి కుదుట పడ్డట్లుగా తెలుస్తోంది.ఆసుపత్రి వర్గాల వారు మరియు ఎస్పీ చరణ్‌ కూడా బాలు ఆరోగ్యం విషయంలో గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

ఆయన శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని, త్వరలోనే ఆయన సొంతంగా శ్వాస తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రస్తుతం ఆయన ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు.దానికి తోడు కరోనా ఇంకా నెగటివ్‌ రాలేదు.

అందుకే ఆయనకు అత్యున్నత స్థాయి ట్రీట్‌మెంట్‌ను అందిస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. """/"/ ఈ విషయంలో డాక్టర్లు మరియు చరణ్‌ పాజిటివ్‌ గా రెస్పాండ్‌ అవ్వడంతో బాలు అభిమానులు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత కోలుకుని ఆయన తిరిగి మైక్‌ అందుకోవాలని అభిమానులు మరియు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.

ఆయన ఆరోగ్యం విషయంలో జాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌ కోలీవుడ్‌ వరకు ఎంతో మంది ప్రముఖులు ఆరా తీయడంతో పాటు స్పందించిన విషయం తెల్సిందే.

దేవర నైజాం,ఆంధ్ర బిజినెస్ లెక్కలు ఇవే… అన్ని కోట్లు వస్తేనే సేఫ్?