అంగాంగ ప్రదర్శన చేస్తేనే అవకాశాలు వస్తాయా.? హీరోయిన్స్ పై ఎస్.పి.బాలు సంచలన కామెంట్స్.!
TeluguStop.com
బాలసుబ్రహ్మణ్యం గారు వివాదాలకు ఎంత దూరంగా అందరికి తెలిసిందే.కానీ తాజాగా తెలుగు సినిమాల్లో నటించే ఇతర రాష్ట్ర హీరోయిన్ల పై సంచలన కామెంట్స్ చేసారు.
అంగాంగ ప్రదర్శన చేస్తేనే అవకాశాలు వస్తాయా.? అవకాశాల కోసం ఓ స్త్రీ పాత్రధారి ఇంత దిగజారిపోవాలా.
? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గతంలోనూ సినిమాలు వచ్చేవని, కానీ హీరోయిన్లు మరీ ఇంత దిగజారి నటించలేదని, కానీ ఇప్పుడు స్త్రీ జాతి సిగ్గు పడేలా తెరపై స్త్రీ పాత్రధారుల వస్త్రధారణ ఉంటోందనీ, ఇలా స్పందించినందుకు హీరోయిన్లు తనని తిట్టినా ఫర్వాలేదన్నారు బాలు.
Iframe Width="560" Height="315" Src="https://!--wwwyoutube!--com/embed/b9YWOGF_8Ag" Frameborder="0" Allow="accelerometer; Autoplay; Encrypted-media; Gyroscope; Picture-in-picture" Allowfullscreen/iframe
ఈ క్రమంలో తప్పంతా హీరోయిన్లదే అని కూడా అనలేము.
ఓ కథానాయిక తెరపై ఎలా కనిపించాలన్నది దర్శకుడి అభిరుచిని బట్టి ఉంటుంది.ఒక్కో దర్శకుడి ఫ్రేములో హీరోయిన్లు ఒక్కోలా కనిపిస్తారు.
ఓ సినిమాలో సంప్రదాయ దుస్తుల్లో అలరించిన నాయిక, మరో సినిమాలో గ్లామర్ పాత్రలో హల్ చల్ చేస్తుంది.
ఇలాంటి దుస్తులు నేను వేసుకోను అని చెప్పే హక్కు మాత్రం కథానాయికకు ఉంది.
కానీ.అంత ధైర్యం ఎవరికీ లేదు.
ఎందుకంటే అలా అంటే తర్వాత సినిమా అవకాశాలు రావు.ఈ విషయంలో కేవలం కథానాయికల్ని నిందించాల్సిన పనిలేదు.
దర్శకులకూ ఇందులో వాటా ఉంది.