సోయం బాబురావును తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ..తిరుపతి నాయక్
TeluguStop.com
బిజెపి కో హాటవో తండాకో బచావో,సోయి లేని సోయం బాబురావును తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి బీజేపీ పార్టీ లో వున్న లంబాడా మిత్రులు వెంటనే పార్టీ ని బహిష్కరించండి .
ఆదివాసుల, గోర్ (లంబాడీ)ల మధ్య చిచ్చుపెట్టి బిజెపి పార్టీ అధికారం లోకి రావాలనుకోవడం మీ మూర్ఖత్వంగిరిజనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana State Govt ) 6 శాతం నుండి 10 శాతం పెంచిన రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఎందుకు అనుమతి ఇవడం లేదు, తెగల మధ్య చిచ్చు పెట్టి వారు కొట్లాటలో చనిపోయినంక ?బ్రతికినవరి రిజ్వేషన్ పెంచుతార?ఎంపి బాబు రావు ను బిజెపి పార్టీ నుండి బహిష్కరించండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు అజ్మీర తిరుపతి నాయక్ డిమాండ్, రాజన్న సిరిసిల్ల జిల్లా : బిజెపి పార్టీ ఎంపీ సోయం బాబు రావు తెలంగాణ రాష్ట్రన్ని మరో మణిపూర్ లాగా రావణ కాష్టంగా చేయాలని కుట్ర పన్నుతోన్నారు, ఇది మీ పార్టీ సంబంధం లేకపోతే మీ బిజెపి పార్టీ నుండి బహిష్కరించాలని , పార్లమెంటు సభ్యుడుగా కొనసాగే అర్హత లేదన్నారు.
వెంటనే పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలనీ, అప్పుడు మీ మాటలను గిరిజన ప్రాంతాల్లో ప్రజలు నమ్ముతారని తిరుపతి నాయక్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏదో రకంగా అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ఈ విదంగా జాతుల మధ్య చిచ్చు రేపి ఇక్కడ ఆదివాసులు, గోర్ (గిరిజనులు)ల మధ్య చిచ్చు రేపి రాజకీయం చేయటం కోసం గిరిజనులను పావుగా వాడుకొని మీ పార్టీ పబ్బం గడపడం కోసం చేసే కుట్ర పన్నుతోందని అర్దం అవుతుందనీ అన్నారు.
కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను 6 శాతం నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచడం జరిగిందన్నారు.
ఈ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో తీర్మనం చేసిన ఈ బిల్లును కేంద్రం అనుమతి కోసం పంపడం జరిగిందనీ ఎందుకు మీ కేంద్రం లో ఉన్నా బిజెపి ప్రభుత్వం( BJP Party ) పార్లమెంటు లో ఆమోదించడం లేదనీ ,తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన రిజర్వేన్లపై మీరు అధికారం లో వచ్చాక ఇస్తామనడంహాస్యాస్పదంగా ఉందన్నారు.
ప్రైవేట్ రంగంలో రిజ్వేషన్ ఎలాగో ఇవ్వలేదని మరి ఎందులో ఇస్తారు, ఉద్యోగాలు చేయటానికి కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఉన్న కంపెనీలు సుమారుగా 6 లక్షల కోట్ల విలువ గల కంపెనీలు ప్రైవేటుపరం చేశారు.
ప్రైవేటుపరంలో రిజర్వేషన్లు ఉండవు అంబానీకి , అదానికి ఆ కంపెనీ ఆ రాష్ట్రం వాళ్లే ప్రైవేట్ ఉద్యోగాలుగా ఉంటారు.
మిగతా రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఉపాధి ఎక్కడ దొరుకుతుందనీ పెద్ద పెద్ద బడా కంపెనీ దారులు సంస్థలు కొనుక్కొని వాళ్లకు సంబంధించిన వాళ్ళే వాళ్ళ రాష్ట్రం వాళ్లకే ఉపాధి అవకాశాలు కల్పిస్తారనీ, మిగతా రాష్ట్రాలకు రావనీ ఒకవేళ మీరు రిజర్వేషన్లు చేస్తే భవిష్యత్తులో గ్రామీణ ఉపాధి హామీ పథకం రిజర్వేషన్ మీరు అమలు చేస్తే దాంట్లో పనిచేసుకోవడానికి ఈ రిజర్వేషన్లు పనికొస్తాయనీ అన్నారు.
ఇప్పటికైనా భారత దేశ జాతీయ ఆస్తిని కాపాడండి.మీరు ప్రైవేటుపరం చేయటం వల్ల చిన్న చిన్న వాగులు వంకలు ద్వారా సముద్రానికి నీరు చేరుతుంది.
సంపన్నుడు సంపన్నుడుగాను పేదవాడు పేదవాడుగానే ఉంటాడు.జాతి ఆస్తిని కాపాడండి ప్రైవేటుపరం చేయకండనీ,ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపాధి దొరకాలంటే ప్రభుత్వ సంస్థలు ఉండాలన్నారు.
అప్పుడే నిజమైన పేదలకు ఉపాధి దొరికి జాతీయ ఆస్తిలో ఉపాధి పొంది అవకాశం ఉంటదన్నారు.
ఆర్థికంగా వెనుకబడిన కులాలు పురోగతి సాధించడానికి అదే ఏకైక మార్గం మీరు చేసే కార్యక్రమాలు ప్రజలందరూ గమనిస్తున్నారనీ ప్రభుత్వాలు తప్పు చేస్తే దాని మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు.
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది నన్ను ఎవరు చూడటం లేదని అనుకోవటం మూర్ఖత్వం అని దయచేసి జాతి ఆస్తిని కాపాడండి అణగారిన కులాల అభివృద్ధికి తోడ్పడండి జాతుల కొట్లాట పెట్టి అధికారం దక్కించుకోవాలని బిజెపి పార్టీ చేస్తున్న పన్నాగంలో భాగమే తెలంగాణ రాష్ట్రంలో లంబాడి, ఆదివాసుల మధ్య గొడవలు పెట్టడానికి మరో కుట్ర కనిపిస్తున్నదన్నారు.
భారత దేశంలో ఎక్కడ చేయని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి ఇంటికి చేరే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో ఈ తొమ్మిది సంవత్సరాల్లో అభివృద్ధి మార్గంలో తెలంగాణ రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎక్కడ ఏమి చేయలేము అని గ్రహించి భయంతో బిజెపి పార్టీ అదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు( Adilabad MP Soyam Bapurao )ను అడ్డం పెట్టుకొని మణిపూర్ రాష్ట్రంలో ఏ విధంగానైతే అక్కడి తెగల మధ్య కొట్లాటలు పెట్టి వందల మందికి చావుకు కారణమైందో అదే విధంగా తెలంగాణ రాష్ట్రాలో వల్లకాడు చేయాలనే కుట్ర కోణం జరుగుతుందని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నదనీ అన్నారు .
బిజెపి అధికారంలో రావడానికి మతాల మధ్యలో చిచ్చుపెట్టాలి? లేదా హిందూ ముస్లిం మధ్య కొట్లాట సృష్టించాలి లేదా జాతుల మధ్య కొట్లాటలు పెట్టాలి? ఏదో ఒకటి కులాల మధ్యనొ మతాల మధ్యనొ? జాతుల మధ్యనొ? ప్రజలను కొట్లాటలు పాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాటు చేయడానికి కుట్ర పన్నుతోందని అన్నారు.
ఇప్పటికీ గిరిజన ప్రజలంతా జాగ్రత్తగా గ్రహిస్తున్నారని మీ ఆటలు సాగనివ్వమని ఇప్పటికైనా మీ కూతల ప్రయత్నాలను మానుకోవాలని అన్నారు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగతంగా పరిగణిస్తున్నాం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మీకు దమ్ముంటే అదిలాబాద్ ఎంపీ బాబురావును ముందుగా బిజెపి పార్టీ నుండి సస్పెండ్ చేయాలి.
వెంటనే ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు.అతనిపై ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుండు కాబట్టి అతనిపై దేశద్రోహం కేసును పెట్టి అరెస్టు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?