సౌమ్య రావు ఇంత త్వరగా కనెక్ట్ అయ్యిందే..!
TeluguStop.com
సక్సెస్ ఫుల్ షో జబర్దస్త్ కు కొత్త యాంకర్ గా వచ్చింది సౌమ్యా రావు.
అనసూయ ప్లేస్ లో కొన్నాళ్లు రష్మితో నడిపించగా సౌమ్యా రావు టాలెంట్ గుర్తించి ఆమెని యాంకర్ గా ఫిక్స్ చేశారు.
అయితే వచ్చిన కొన్నాళ్లకే సౌమ్యా రావు జబర్దస్త్ ఆడియన్స్ కు దగ్గరైంది.వచ్చి రాని తెలుగు మాటలతో సౌమ్యా రావు యాంకరింగ్ అలరిస్తుంది.
ఇక టీం లీడర్స్ కూడా ఆమెపై వేసే పంచులను ఆమె పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంటుంది.
సౌమ్య రావు ఇంత త్వరగా షోకి కనెక్ట్ అవుతుందని ఎవరు ఊహించలేదు.కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన సౌమ్య రావు తెలుగు సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.
ఈటీవీ ఫెస్టివల్ షోలో హైపర్ ఆది మీద ఆమె వేసిన పంచులు నచ్చడంతో ఆమె జబర్దస్త్ యాంకర్ గా తీసుకున్నారు.
జబర్దస్త్ యాంకరింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం ఆమె ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది.
వారికోసం అమ్మడు రీల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంది.సౌమ్యా రావు ఈ స్పెషల్ షోకి ఆడియన్స్ ఆమెని మరింత ఎంకరేజ్ చేస్తున్నారు.
సోషల్ మీడియా సందడి కూడా ఎక్కువ అవడంతో ఆమె క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది.