క్వీన్ సౌత్ రీమేక్స్ అన్ని కూడా ఓటీటీలోనే

క్వీన్ సౌత్ రీమేక్స్ అన్ని కూడా ఓటీటీలోనే

బాలీవుడ్ లో కంగనా రనౌత్ లీడ్ రోల్ లో తెరకెక్కి సూపర్ హిట్ అయిన మూవీ క్వీన్.

క్వీన్ సౌత్ రీమేక్స్ అన్ని కూడా ఓటీటీలోనే

ఈ సినిమా తర్వాత కంగనా ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది.ఆమెకి హీరోల స్థాయిలో స్టార్ ఇమేజ్ ని ఈ సినిమా తీసుకొచ్చింది.

క్వీన్ సౌత్ రీమేక్స్ అన్ని కూడా ఓటీటీలోనే

వంద కోట్లకి పైగా ఆ సినిమా అప్పట్లో కలెక్ట్ చేసింది.ఇక ఈ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉండటంతో సౌత్ భాషలలో రీమేక్ రైట్స్ ని ఓ బడా నిర్మాత సొంతం చేసుకున్నాడు.

ఇక నాలుగు భాషలలో నలుగురు హీరోయిన్స్ ని తీసుకొని ముగ్గురు దర్శకులతో ఈ సినిమాని తెరకెక్కించారు.

తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్ అగర్వాల్, కన్నడంలో పారుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ ఇందులో టైటిల్ రోల్స్ పోషించారు.

ఇక ఈ సినిమా షూటింగ్ గత ఏడాదే కంప్లీట్ అయిపోయింది.ఆ తరువాత ట్రైలర్స్ కూడా రిలీజ్ అయ్యాయి.

అన్ని భాషలలో ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే అనేక బాలారిష్టాలు దాటుకొని రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా తరువాత ఎందుకనో రిలీజ్ కాలేదు.

ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ కూడా పూర్తిగా దాని గురించి మరిచిపోయారు.

దర్శకులు కూడా పక్కన పెట్టేసారు.ఇక కోట్ల రూపాయిలు పెట్టి సినిమా తీసిన నిర్మాత కూడా ఎందుకనో సినిమాల గురించి అప్డేట్ అయితే ఇవ్వలేదు.

తాజాగా ఈ క్వీన్ రీమేక్ గా సినిమాలని నేరుగా ఒటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాత ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలని థియేటర్ లో రిలీజ్ చేయలేనని చేతులు ఎత్తేసిన అతను ఓటీటీ చలవతో మరల డిజిటల్ లో రిలీజ్ చేసి పెట్టిన పెట్టుబడిలో కొంత వరకైనా రాబట్టుకుంటే చాలు అనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

ప్రముఖ ఓటీటీ చానల్ ఈ సినిమా రిలీజ్ కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.

మరి దీనికి సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఇది కదా అసలైన పెళ్లిరోజు గిఫ్ట్.. వైరల్ వీడియో

ఇది కదా అసలైన పెళ్లిరోజు గిఫ్ట్.. వైరల్ వీడియో