సౌత్ లో బ్లాక్ బస్టర్స్... బాలీవుడ్ లో అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఇవే?

తీసే సినిమాలు అన్నీ హిట్ అయ్యి కోట్ల కలెక్షన్ లు రాబడితే ఇక సమస్య ఏముంటుంది.

అందరూ సినిమా పరిశ్రమకి వచ్చేసి సినిమాలు తీసే పనిలోనే ఉంటారు.కథ, కథనం, నట ప్రదర్శన బాగుంటనేనే సినిమా ప్రేక్షకులకు నచుతుంది కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.

అంతే కనే కథలో దమ్ము లేకుండా ఎంత స్టార్ నటులను పెట్టి సినిమా తీసినా వృధా అవుతుంది.

అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది.ఇండియాలో ఉన్న కొన్ని భాషల సినిమా పరిశ్రమలు ఉన్నాయి.

అయితే ప్రతి ఒక్క భాషలో తీసే సినిమాలు అన్నీ హిట్ కాకపోయినా, కొన్ని హిట్ అవుతుంటాయి.

ఇలా హిట్ అయిన సినిమాలను వేరే భాషలో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

కానీ ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలో హిట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేము.

ఎందుకంటే అక్కడ చూసే ప్రేక్షకులు వేరే.డైరెక్టర్ ఆ ప్రాంత ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు.

అయితే టాలీవుడ్ లో రిలీజ్ అయి హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ చేయగా అక్కడ మాత్రం చేదు ఫలితాన్ని ఇచ్చాయి.

మరి ఆ సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం.న్యాచురల్ స్టార్ నాని తెలుగులో నటించిన చిత్రం జెర్సీ.

ఇది క్రీడా నేపథ్యం ఉన్న సినిమాగా అద్భుతంగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు.ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

మంచి కలెక్షన్ లను సాధించింది.అయితే ఈ సినిమా పట్ల బాలీవుడ్ నిర్మాతలు ఉత్సాహం చూపి రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసి అక్కడ షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ ని రీమేక్ చేశారు.

అయితే ఈ సినిమా గత వారమే రిలీజ్ అయింది.పాజిటివ్ టాక్ ను సొంత చేసుకున్నా, కలెక్షన్ లు మాత్రం సాధించలేక పూర్తిగా నిరాశపరుస్తోంది.

దీనిపై ఆర్జీవీ కూడా సెటైర్లు వేస్తున్నాడు. """/"/అయితే దీనికి కారణం ఉంది.

ఆల్రెడీ ఇలా హిట్ అయిన సినిమాలను, ఓటిటి ఛానెల్స్ సబ్ టైటిల్స్ తో ఇతర భాషలలో విడుదల చేస్తున్నారు.

దీనితో ప్రేక్షకులు కూడా చూసేసి.మళ్ళీ వేరే హీరో అదే కథను తెరకెక్కిస్తే చూడలేకపోతున్నారు.

అందుకే సినిమా బాగున్నా కలెక్షన్ లు మాత్రం దారుణంగా ఉన్నాయి.అందుకే బాలీవుడ్ రీమేక్ చేస్తున్న సౌత్ ఇండస్ట్రీ సినిమాలు అన్నీ డిజాస్టర్ లుగా మిగిలిపోతున్నాయి.

ఇక అదే విధంగా తమిళ్ మరియు తెలుగు భాషలలో ఆల్రెడీ రిలీజ్ అయి అద్భుత విజయాన్ని అందుకున్న జిగర్తాండ మరియు గద్దల కొండ గణేష్ చిత్రాలు హిట్ అయ్యాయి మరియు మంచి కలెక్షన్ లు సాధించాయి.

అయితే ఈ సినిమాపై మనసు పారేసుకున్నాడు మన అక్షయ్ కుమార్.బాలీవుడ్ లో బచ్చన్ పాండే అంటూ రీమేక్ చేశారు.

కానీ లాభం లేకుండా పోయింది. """/"/ కానీ ఈ సినిమా అక్కడ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఇక ఇది కాకుండా అంత కు ముందు చాలా కాలం క్రితం రాఘవ లారెన్స్ దర్శకత్వం మరియు నటించిన చిత్రం కాంచన తమిళ్ మరియు తెలుగు భాషలలో ఎంత పెద్ద హిట్ అనేది తెలిసిందే.

కానీ బాలీవుడ్ లో మళ్ళీ అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మి గా రీమేక్ చేశారు.

కానీ హిందీ ప్రేక్షకులు దీనిని ఆదరించలేక ప్లాప్ చేసి పెట్టారు.దీనితో బాలీవుడ్ ప్రేక్షకులు మళ్ళీ సౌత్ సినిమాలను రీమేక్ చేయొద్దని ప్రాధేయపడుతున్నారు.

ఇకపై అయినా బాలీవుడ్ ఈ ప్రయత్నాలను ఆపుతుందా అన్నది చూడాలి.

పొడి చర్మంతో దిగులొద్దు.. రోజు నైట్ ఈ ఆయిల్ ను వాడితే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే!