వావ్, 52 ఏళ్ల వయసులో 25 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తున్న దక్షిణ కొరియా మహిళ..?
TeluguStop.com
ప్రతి ఒక్కరూ తమ వయసు కంటే యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు కదా! కానీ అది అంత సులభం కాదు.
అయితే కొంతమంది మాత్రం ముసలి వయసులోనూ ఎంతో యవ్వనంగా ఉంటారు.వారిని చూస్తే వయసు చెప్పడమే కష్టం.
దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా దక్షిణ కొరియాకు( South Korea ) చెందిన లీ హ్యో-జాంగ్( Lee Hyo-Jong ) అనే వ్యాపారవేత్త నిలుస్తోంది.
ఆమెకు 52 ఏళ్లు అయినా, చూడడానికి 24 లేదా 25 ఏళ్ల యువతిలా ఉంటుంది.
ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. """/" /
సీయుల్ నగరంలోని లండన్ బేగెల్ మ్యూజియం కేఫ్( London Bagel Museum Cafe ) యజమాని లీ చాలా యవ్వనంగా కనిపించడం వల్ల సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయింది.
1973లో జన్మించిన ఆమె చాలా సన్నగా ఉంటుంది.అంతేకాకుండా ఆమె వేసుకునే దుస్తులు కూడా చాలా స్టైలిష్‌గా ఉంటాయి.
అందుకే ఆమె వయసు కంటే చాలా చిన్న అమ్మాయిలాగా కనిపిస్తుంది.లీ హ్యో-జాంగ్ ఎంతో అందంగా ఉండడంతో ఒక కస్టమర్ ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దాంతో ఆమె గురించి చాలా మందికి తెలిసింది. """/" /
ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత, చాలా త్వరగా ఆమె ఫేమస్ అయిపోయింది.
ఆమె ఇంత యవ్వనంగా ( Young ) ఎలా ఉంటుందో అని అడిగితే, లీ హ్యో జాంగ్ ఏమీ చెప్పడానికి ఇష్టపడలేదు.
తన వ్యాపారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని ఆమె అనుకుంటుంది.ఆమె మూడు కేఫ్‌లు నడుపుతుంది.
తన వయసు గురించి మాట్లాడటం కంటే తన పనిని ముఖ్యంగా భావిస్తుంది.ఇంటర్నెట్‌లో లీని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకంటే ఆమె చాలా యవ్వనంగా కనిపిస్తుంది.అందరూ ఆమె అందాన్ని చూసి ఫిదా అవుతున్నారు.
లీ తన అందానికి రహస్యం ఏమిటో చెప్పడానికి ఇష్టపడకపోయినా, చాలా మంది ఆమె గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
ఎందుకంటే చాలా మంది తాము యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు.
ఖాళీ కడుపుతో వీటిని తింటే చాలా డేంజర్..!