బాలీవుడ్ ను సౌత్ స్టార్స్ రూల్ చేయడం ఖాయం..

ఇండియన్ సినిమా పరిశ్రమను గత కొంత కాలంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ డామినేట్ చేస్తోంది.

క్లాస్, మాస్ అనే తేడా లేకుండా సౌత్ మూవీస్ రికార్డులు బద్దలు కొడుతున్నాయి.

సౌత్ హీరోలు సైతం క్లాస్, మాస్ పాత్రలు పోషిస్తూ సత్తా చాటుతున్నారు.బాలీవుడ్ తో పోల్చితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోలకే ఎక్కువ క్రేజ్ వస్తోంది.

ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ ను సౌత్ హీరోలు డామినేట్ చేస్తున్నారు.అటు సౌత్ హీరోల్లో చాలా మంది బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆల్రెడీ సౌత్ నుంచి పలువురు హీరోలు బాలీవుడ్ సినిమాలు చేశారు కూడా.అంతేకాదు పాన్ ఇండియన్ సినిమాలు కూడా చేస్తున్నారు.

నిజానికి చాలా మంది సౌత్ హీరోలు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నా.బాలీవుడ్ హీరోలు మాత్ర సౌత్ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు.

సౌత్ ఇండియన్ హీరోల క్రేజ్ ఏపాటితో తెలియాలంటే వారి సినిమా టీజర్లకు వచ్చిన వ్యూస్ చూస్తేనే అర్థం అవుతోంది.

ఆయా సినిమాలకు వచ్చిన టీజర్స్ చూస్తే కళ్లు చెదరక తప్పదు.ఇండియాలో మోస్ట్ వ్యూస్ కలిగిన టీజర్స్ అన్ని సౌత్ సినిమాలవే కావడం విశేషం.

"""/"/ మాస్ ఫాలోయింగ్ తో సౌత్ టీజర్స్ ఓ రేంజిలో వ్యూస్ సాధించాయి.

ఇప్పటికే పలు టీజర్స్ ఈ విషయాన్ని రుజువు చేశాయి.ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్లలో నెంబర్ వన్ గా నిలిచింది కేజీఎఫ్-2 టీజర్.

కేజీఎఫ్ టీజర్ ప్రస్తుతం 191 మిలియన్స్ వ్యూస్ తో టాప్ లో నలిచింది.

దాని తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమా, రజనీకాంత్ రోబో సినిమాలు 72.

4 మిలియన్స్ వ్యూస్ సాధించాయి.అటు విజయ్ దళపతి సినిమా మాస్టర్ 698 మిలియన్ వ్యూస్ సాధించాయి.

ఈ లెక్కతో పోల్చితే బాలీవుడ్ తో పోల్చితే సౌత్ ఇండస్ట్రీకి ఎక్కువ క్రేజ్ ఉన్నట్లు అర్థం అవుతోంది.

రానున్న రోజుల్లో బాలీవుడ్ ను సౌత్ స్టార్స్ రూల్ చేసే అవకాశం ఉందని బల్లగుద్ది చెప్పుకోవచ్చు.

ఈరోజు జరిగే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో గెలిచేది ఏ టీమ్ అంటే..?