రెడ్ కార్పెట్ ను హీటెక్కించిన.. సౌత్ఇండియన్ ముద్దుగుమ్మలు?

ప్రపంచ సినిమారంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.

ఫ్రాన్స్ వేదికగా జరిగే ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా అందరూ స్టార్లు కూడా విచ్చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

కాగా కాన్స్ ఫెస్టివల్ ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది.ఈ క్రమంలోనే ఈ ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమానికి తమన్నా, పూజ సహ దీపిక పదుకునే కూడా ఇండియన్ సినిమా నుంచి పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే తమ అందాలతో రెడ్ కార్పెట్ ను హీట్ ఎక్కించారు ఈ ముద్దు గుమ్మలు.

తమ అందాన్ని రెట్టింపు చేసే డ్రెస్సులు వేసుకొని ర్యాంప్ వాక్ చేసి అందర్నీ మైమరిపించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

కాగా ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈసారి దీపికాపదుకునే జ్యూరీ సభ్యురాలిగా కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే ఈ ఫెస్టివల్ జరిగినన్ని రోజులు కూడా దీపికా పదుకొనే పాల్గొన్నారు.

ఇక మొదటి రోజు దీపిక పదుకొనె తో పాటు ఊర్వశి రౌతేలా రెడ్ కార్పెట్పై మెరిసారు.

తమన్నా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో తళుక్కుమంది. """/"/ ఇక రెండో రోజు ఈ ఫిలిం ఫెస్టివల్లో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ సందడి చేయడం గమనార్హం.

ఐశ్వర్య ఇప్పటికే క్వీన్ ఆఫ్ కాన్స్ గా గుర్తింపు సంపాదించుకుంది.ఈ ఏడాది సింపుల్ మేకప్ లో రెడ్ కార్పెట్ పైకి రాగానే ఒక్కసారిగా అందరి దృష్టి ఆమె వైపు మళ్లింది అని చెప్పాలి.

రాంప్ వాక్ చేసిన సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే వీడియో అక్కడ ఉన్న వారందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

"""/"/ ఈ క్రమంలోనే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి అవకాశం రావడంఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

ఇక మూడో రోజు దీపికా పదుకొనే మెరిసింది అని చెప్పాలి.నాలుగవ రోజు దీపికా తోపాటు ఐశ్వర్యరాయ్ పాల్గొన్నారు.

మాధవన్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన రాకేట్రి బి నుండి ఎఫెక్ట్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడటం గమనార్హం.

ఖంగుతిన్న పూణే జనం.. రోడ్డునే జిమ్‌గా మార్చేసిన తాగుబోతు.. ట్రాఫిక్‌లో ఏం చేసాడో చూడండి..