ఈ ప్రముఖ టాలీవుడ్ నటి ఇద్దరు కూతుళ్లు డాక్టర్లే.. ఎంతో అదృష్టవంతురాలు అంటూ?
TeluguStop.com
ఇతర రంగాలతో పోల్చుకుంటే ఒక సినిమా రంగంలోనే వారసుల రంగ ప్రవేశం ఎక్కువగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ కాకపోయినా సినిమా ఇండస్ట్రీలో హీరో కొడుకు మాత్రమే హీరో అవుతున్నారు.
అలా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
చిత్రపరిశ్రమకు చెందిన వారి వారసులు ఇప్పటికే హీరోలు, హీరోయిన్(Heroes ,heroines) లు, దర్శకులు, నిర్మాతలు గానూ రాణిస్తున్నారు.
అయితే ఒక సినీ జంట మాత్రం తమ వారసులను సినిమాకు దూరంగా, వైద్యులను చేయడం విశేషమే అని చెప్పాలి.
"""/" /
ఆ జంట ఎవరో కాదు తమిళ నటుడు, దర్శకుడు పొన్వన్నన్, శరణ్య (Ponvannan, Saranya)దంపతులే.
వారి గురించి చెప్పాలంటే మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా నటించిన నాయకన్ చిత్రం ద్వారా హీరోయిన్ గా శరణ్య సిటీ ఎంట్రీ ఇచ్చింది.
అందులో అమాయకమైన యువతి పాత్రలో చక్కని నటనను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు శరణ్య.
ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో పలు సినిమాలలో నటించి మెప్పించింది శరణ్య.
ఆ తరువాత అక్కగా, అమ్మగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్నారు.
రఘువరన్ బీటెక్(Raghuvaran B.Tech) చిత్రంలో ధనుష్ కు(Dhanush) అమ్మగా శరణ్య నటించారు.
ఆ చిత్రంతో తెలుగు వారికి మరింత చేరువ అయ్యారు. """/" /
ఇక పొన్వన్నన్ కూడా పలు చిత్రాల్లో నటిస్తుండడంతో పాటు కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.
ఇలా చిత్ర పరిశ్రమలో హోదా, అంతస్తు గడించిన ఈ సినిమా జంట తమ వారసులను మాత్రం ఈ రంగానికి దూరంగా పెంచడం విశేషం.
వీరికి చాందిని, ప్రియదర్శిని అనే ఇద్దరు కూతుళ్లు.చూడడానికి ఇద్దరూ హీరోయిన్స్ లా ఉంటారు.
అయితే పొన్వన్నన్, శరణ్య దంపతులు తమ ఇద్దరి వారసురాళ్లనూ వైద్య విద్యను అభ్యసించేలా చేశారు.
వారిద్దరూ డాక్టర్లుగా పట్ట భద్రులు అయ్యారు.గత ఏడాదిలో పెద్ద కూతురు చాందిని ఎంబీబీఎస్ పూర్తి చేయగా ఇప్పుడు రెండో కూతురు ప్రియదర్శిని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో పట్టభద్రురాలైంది.
దీనికి సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీంతో ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ అభిమానులు నిజంగా చాలా గ్రేట్ ఒకే ఇంట్లో ఇద్దరు డాక్టర్లు ఉండడం అన్నది చాలా గొప్ప విషయం అంటూ కామెంట్ చేస్తున్నారు.
కీళ్ల నొప్పుల నుంచి మలబద్ధకం నివారణ వరకు ఆముదంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?